35 ఏళ్లకు పైగా బిజెపి కార్యకర్తలకు హస్తభూషణంగా మారిన జనసందేశ్ డిజిటల్ ఎడిషన్ ప్రారంభమైంది. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి వెబ్ సైట్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసందేశ్ డిజిటల్ ఎడిషన్ బిజెపి కార్యకర్తలకే కాకుండా సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. జనసందేశ్ బృందానికి జి. కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.