లేటరల్ ఎంట్రీపై కాంగ్రెస్ రాజకీయాలు
లేటరల్ ఎంట్రీ ప్రక్రియను ప్రారంభించినప్పుడు కాంగ్రెస్ రాజ్యాంగాన్నీ అనుసరించలేదని, రిజర్వేషన్లను కల్పించలేదని బిజెపి ముంబై శాఖ ఉపాధ్యక్షుడు హితేష్ జైన్ విమర్శించారు. ప్రధాన ఆర్థిక సలహాదారుగా మన్మోహన్ నియామకం నుంచి జాతీయ సలహా మండలి (ఎన్ఏసీ) వరకు పారదర్శకత, రిజర్వేషన్లపై ఎలాంటి చర్చలు జరపలేదన్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టిస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అంబేద్కర్ నిర్దేశించిన సామాజిక న్యాయం సూత్రాల మేరకే నియామక ప్రక్రియ జరగాలని మోదీ ప్రభుత్వం స్పష్టం చేసిందని ఆయన అన్నారు. ఒక జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఈ ఇంటర్వ్వూలో హితేష్ జైన్ లేటరల్ ఎంట్రీపై తన అభిప్రాయలు వెల్లడించారు.
ప్ర: గత ప్రభుత్వంతో పోల్చితే, ప్రత్యేకించి సామాజిక న్యాయం, సమానత్వం కోణంలో లేటరల్ ఎంట్రీ అంశంపై ప్రస్తుత ప్రభుత్వం విధానంపై మీ అభిప్రాయం ఏమిటి?
జ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని లేటరల్ ఎంట్రీ ప్రక్రియ పారదర్శకంగా, తటస్థంగా ఉంది. అందరినీ కలుపుకొని వెళ్లడమే దాని లక్ష్యంగా ఉంది. ప్రభుత్వ పాత్ర విషయానికొస్తే రాజ్యాంగంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ నిర్దేశించిన సామాజిక న్యాయం సూత్రాల మేరకే నియామక ప్రక్రియ జరగాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్ర: కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు నేడు విశ్వసనీయత ఉందా?
ప్ర: మన్మోహన్ సింగ్ నియామకాన్నే తీసుకుంటే, అసలు లేటరల్ ఎంట్రీ విధానాన్ని ప్రారంభించిందే కాంగ్రెస్. ఆయనను ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అలాగే జాతీయ సలహా మండలి (ఎన్ఏసీ)ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్సే. అప్పట్లో పారదర్శకత లేదా రిజర్వేషన్లపై ఎలాంటి చర్చలు జరగలేదు.
ప్ర: లేటరల్ ఎంట్రీ పథకంలో ఎస్సీ/ఎస్టీలు, ఓబీసీలు, సమాజంలోని ఇతర అణగారిన వర్గాలకు ప్రాధాన్యం ఉండేలా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎలా చూస్తుంది?
జ: కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ యూపీఎస్‌సీకి రాసిన లేఖలో సామాజిక న్యాయం ప్రమాణాలకు అనుగుణంగా లేటరల్ ఎంట్రీ ప్రక్రియ జరగాలని నొక్కి చెప్పారు. రిజర్వేషన్ విధానం ఏదైనా అమల్లో ఉన్నా దానిని చట్టపరమైన నిబంధనల ప్రకారం సమీక్షించాలి. అక్కడ వర్తించే ప్రక్రియను అనుసరించి అర్హులైన వర్గాలకు రిజర్వేషన్లు లభించేటట్టు చూడాలి. లేటరల్ ఎట్రీ ప్రక్రియను సమీక్షించి రద్దు చేయాలని జితేంద్ర సింగ్ అన్నారు. యూపీఎస్‌సీకి లేఖ అందిన వెంటనే అది అప్పటికే కొనసాగుతున్న ప్రక్రియను రద్దు చేసిన విషయం మీకూ తెలుసు. సామాజిక న్యాయం ఆధారంగా ఒక ప్రక్రియ సిద్ధమవుతుందని మేం ఆశిస్తున్నాం. అంబేద్కర్ రాజ్యాంగం లక్ష్యాలను మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.
ప్ర: యూపీఏ హయాంలో కాంగ్రెస్ (ఎన్‌ఏసీ) ద్వారా సమానత్వం, పారదర్శకత సూత్రాలను బలహీనపరిచిందనే వాదనలు ఉన్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
జ: కాంగ్రెస్ ఎప్పుడూ పారదర్శకంగా లేదు. అది కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్ టేప్ రికార్డు ఎప్పుడూ అబద్ధాలు మాట్లాడుతుంది, అసత్యాలను వ్యాప్తి చేస్తుంది. మీరు కాంగ్రెస్ చరిత్ర చూస్తే, మన్మోహన్ సింగ్‌తో ప్రారంభించి, ఎన్ఏసి సభ్యులను పరిశీలించండి. లేటరల్ ఎట్రీ మొత్తం ప్రక్రియలో వారు రిజర్వేషన్ విధానం నిబంధనలను విస్మరించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రిజర్వేషన్ల పట్ల ప్రేమ కనబరుస్తారు. కాంగ్రెస్ చెప్పేదానికి, చేసేదానికి ఎప్పుడూ పొంతన ఉండదు. రాజ్యాంగాన్ని గౌరవించానని చూపించడానికి కాంగ్రెస్ ఎప్పుడూ తన గత చరిత్రను రుజువుగా చూపించలేదు.
ప్ర: లేటరల్ ఎంట్రీ పథకాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ దానిని ఎందుకు వ్యతిరేకిస్తోందని మీరు అనుకుంటున్నారు?
జ: ఈ విషయంలో రాజకీయాలు చేయడం, అసత్యాలు ప్రచారం చేయడం, గందరగోళం సృష్టించడం తప్ప కాంగ్రెస్‌కు మరో మార్గం లేదు. ఆ పార్టీ వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోవడంతో జీర్ణించుకోలేకపోతుంది. ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ చేతిలో ఒకే ఒక పని ఉంటుంది… మురికి రాజకీయాలు చేయడం, కులాల పేరిట ప్రజల్లో చీలికలు సృష్టించడం. కాంగ్రెస్ లేటరల్ ఎంట్రీ ప్రక్రియను ప్రారంభించినప్పుడు అది రాజ్యాంగాన్నీ అనుసరించలేదు, రిజర్వేషన్లను కల్పించలేదు.