Vijaya Sankalpa Yatra Musheerabad

ప్రపంచ దేశాలు భారత ఔన్నత్యాన్ని గుర్తించేలా చేసిన మోదీ

 

Vijaya Sankalpa Yatra Musheerabad

కేరాఫ్ కాంగ్రెస్… అభివృద్ధికి నిలయం బిజెపి అని.. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. కాకతీయ భద్రకాళి క్లస్టర్ వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం హనుమకొండలో జరిగిన బిజెపి విజయ సంకల్ప యాత్రలో ఆయన ముఖ్య అతిథిగా రెడ్డి పాల్గొన్నారు. అవినీతి కాంగ్రెస్ కు ఓటేస్తే దేశం మళ్లీ ముక్కలవుతుందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. కాళేశ్వరం అవినీతి విషయంలో సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీపై యుద్ధం చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందని… అలా యుద్ధం చేస్తా అన్న ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలే ఇంట్లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ తన స్థాయికి తగ్గట్లుగా మాట్లాడాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉందని రాకేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ యాత్ర వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, వర్దన్నపేట నియోజకవర్గాల మీదుగా కొనసాగింది.

జనగాం నియోజకవర్గంలో జరిగిన విజయ సంకల్ప యాత్రలో ముఖ్య అతిధిగా కేంద్రమంత్రి నారాయణ స్వామి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ యాత్రలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ కన్నీళ్లు, దుఃఖం, ఆకలి విలువ తెలిసిన వ్యక్తి కాబట్టే దేశంలో పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. పేదల సొంతింటి కల నెరవేర్చేలా 4 కోట్ల మందికి పక్కా ఇళ్లు నిర్మించారని గుర్తుచేశారు. బిజెపి ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేశారని కొనియాడారు. తెలంగాణలో బాగుపడింది కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమేనని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కు కుటుంబ సభ్యులు మాత్రమే ముఖ్యమని దుయ్యబట్టారు. 140 కోట్ల ప్రజల అభ్యున్నతే ముఖ్యమని భావించే గొప్ప నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని వివరించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపి, నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రిగా చేసుకునేలా ఆశీర్వదించాలని ఈటల రాజేందర్ ప్రజలను కోరారు. కాకతీయ భద్రకాళి క్లస్టర్ లో విజయ సంకల్ప యాత్ర ముగిసింది.

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకున్నా తొమ్మిది లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేసిందని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. బిజెపి కార్యకర్తలు తలుచుకుంటే ఏదైనా జరుగుతుందని, అందుకు నిదర్శనమే కామారెడ్డి నియోజకవర్గమని అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించిన ఘన చరిత్ర కామారెడ్డిదేనన్నారు. రాజరాజేశ్వరి క్లస్టర్ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో విజయ సంకల్ప యాత్ర కొనసాగింది. కామారెడ్డి జిల్లా గాంధారి రోడ్ షోలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్-బీఆర్ఎస్ అవినీతిపై మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరంలో ప్రాజెక్టులో జరిగిన అవినీతి విషయంలో విచారణ జరపకుండా… కేవలం ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికే గత బీఆర్ఎస్ సర్కారు తెలంగాణను లక్షల కోట్ల అప్పుల్లో ముంచితే… కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల పేరుతో మభ్యపెడుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే రూ.2 లక్షల కోట్లు అవసరమని… అందుకే నిధులు ఎలా సమకూరుస్తారని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి నరేంద్ర మోదీ ప్రభుత్వంతోనే సాధ్యమని.. జహీరాబాద్ ప్రజలు బిజెపి ఎంపీ అభ్యర్థికి తప్పనిసరిగా ఓటు వేయాలని కోరారు. నరేంద్ర మోదీని ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిని చేయాలని వెంకటరమణా రెడ్డి పిలుపునిచ్చారు. కృష్ణమ్మ క్లస్టర్ ముగింపు యాత్రకు ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్ ముఖ్యఅతిథిగా హాజరై.. రోడ్ షోలో పాల్గొన్నారు.