Nitin Gadkari at Vijaya Sankalpa Yatra

మోదీ చొరవతో తెలంగాణ పసుపునకు ప్రపంచ గుర్తింపు

Nitin Gadkari at Vijaya Sankalpa Yatra

భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న విజయసంకల్ప యాత్ర పదోరోజు దిగ్విజయంగా కొనసాగింది. ఐదు క్లస్టర్ లలో కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొని, బిజెపి నాయకులకు ఘన స్వాగతం పలికారు. ఊరూరా బైక్ ర్యాలీలు, ముఖ్య కేంద్రాల్లో కార్నర్ మీటింగుల నిర్వహణతో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, పదేండ్ల నరేంద్ర మోదీ పాలన విజయాలను ప్రజలకు వివరించారు.  కొమురం భీం క్లస్టర్ లో పది రోజుల పాటు దిగ్విజయంగా కొనసాగిన విజయసంకల్ప యాత్ర ఫిబ్రవరి 29న ముగిసింది. ఈ సందర్భంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు. 

దేశం అభివృద్ధి చెందాలంటే.. రవాణారంగానిదే కీలక పాత్ర. దేశంలో రవాణా సౌకర్యాలు మెరుగు పడినప్పుడే వ్యాపార, వాణిజ్య రంగాలు అభివృద్ధి చెందుతాయని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.  ఫిబ్రవరి 29న నిజామాబాద్ జిల్లా కేంద్రం పాత కలెక్టరేట్ గ్రౌండ్ లో నిర్వహించిన విజయ సంకల్పయాత్ర  ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలన కారణంగా  అనేక గ్రామాల్లో  కనీస సౌకర్యాలు కూడా లేని దుస్థితి నెలకొందన్నారు.  ప్రజలు పట్టణాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు ఆస్పత్రులు లేక.. విద్య, వైద్యం  మచ్చుకైనా లేకపోవడం.. ఉపాధి అవకాశాలు లభించక దేశవ్యాప్తంగా అనేక గ్రామాలు ఖాళీ అయ్యాయని వాపోయారు.  దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో రోడ్డు రవాణా కోసం ప్రత్యేక దృష్టి పెట్టి దేశంలోని ప్రధాన నగరాలను హైవేలతో అనుసంధానించారు. గ్రామీణ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తూ  ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని  గడ్కరీ గుర్తు చేశారు.  రైతులకు ఆర్థిక చేయూతనిచ్చి వారిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల ఆత్మహత్యలు ఆపేందుకు.. రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు.  తెలంగాణలో పండే పసుపు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతోందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు బిజెపి కి మద్దతు తెలిపి, మోదీని మూడోసారి ప్రధానమంత్రిగా చేసుకునేలా హ్యాట్రిక్ విజయం అందించాలని నితిన్ గడ్కరీ కోరారు.  ఈ యాత్ర ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ నియోజకవర్గాలలో కొనసాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడారు. ఈ సందర్భంగా.. 15 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషితో పసువు క్వింటాలుకు రూ. 15 వేలు పలుకుతోందని తెలిపారు. పసుపు రైతులకు మంచిరోజులు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రధాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అర్వింద్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని రాజకీయంగా వాడుకుంటోందని విమర్శలు గుప్పించారు. 

భాగ్యలక్ష్మి క్లస్టర్ మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో నిర్వహించిన బిజెపి విజయ సంకల్ప యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ యాత్రలో  బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఖుష్బూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యాత్ర పొడవునా మహిళలు పూలు చల్లుతూ బిజెపి నాయకులకు స్వాగతం పలికారు. ఈ యాత్రలో ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఖష్బూ మాట్లాడారు. కంటోన్మెంట్ సమస్యలను తీర్చేది కేంద్ర ప్రభుత్వమేనని.. ఒక్క నిమిషం కూడా సమయాన్ని వృథా చేయకుండా దేశం కోసం పని చేస్తున్న వ్యక్తి మోదీ అని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఖుష్బూ అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కంటోన్మెంట్ ప్రజలు ఆలోచించి ఓటు వెయ్యాలని పిలుపునిచ్చారు. వికసిత భారత్ లక్ష్యంగా కేంద్రంలో బిజెపిని గెలిపించాలని కోరారు. పార్లమెంటు ఎన్నికలలో 400 సీట్లతో నరేంద్ర మోదీ విజయ ఢంకా మోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కరోనా విపత్కర సమయంలో అందరికీ ఉచితంగా టీకాలు ఇచ్చామని, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు స్వేచ్ఛ కల్పించారని తెలిపారు. అదేవిధంగా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో గొప్ప అవకాశాలను కల్పించిందని విజయ సంకల్ప యాత్రలో ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ లో కుటుంబ పాలన తప్ప… దేశానికి చేసిందేమీ లేదని ఖుష్బూ విమర్శించారు. ప్రపంచంలో మూడవ ఆర్ధిక శక్తిగా భారత్ ను నిలపడమే ధ్యేయంగా రాబోయే పార్లమెంటు ఎన్నికలలో ప్రధాని మోదీ గెలుపులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఖష్బూ పిలుపునిచ్చారు. 

కాకతీయ భద్రాకాళి క్లస్టర్ నర్సంపేట్ నియోజకవర్గం నల్లబెల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్రలో సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ యాత్రలో బిజెపి సీనియర్ నాయకులు గరికపాటి మోహన్ రావుతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్వాయి హరీష్ మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీకి ఫోన్ వస్తే వెంటనే విదేశాలకు వెళ్తారన్నారు. నరేంద్ర మోదీ 70 సంవత్సరాల వయస్సులో కూడా దేశం కోసం నిరంతరం కష్టపడుతూనే ఉన్నారని, మోదీ నాయకత్వమే లేకుంటే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం సాకారం అయ్యేదికాదని స్పష్టం చేశారు.  భవ్య రామమందిర నిర్మాణంతో 500 ఏండ్ల ప్రజల కల నెరవేర్చిన నరేంద్ర మోదీకి మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు. 

BJP Sabha at Nizamabad

రాజరాజేశ్వరి క్లస్టర్ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా జహీరాబాద్ అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతమంది ఎంపీలు మారినా అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా నారాయణఖేడ్ నియోజకవర్గమని తెలిపారు. కేవలం భారతీయ జనతా పార్టీతోనే జహీరాబాద్ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. అందుకే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిగా చేసుకునేలా, కేంద్రంలో మరోసారి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. ఈ యాత్ర నారాయణఖేడ్, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో కొనసాగింది. 

కృష్ణమ్మ క్లస్టర్ నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో నిర్వహించిన బిజెపి విజయ సంకల్ప యాత్ర ఉత్సాహంగా కొనసాగింది. యాత్రకు ప్రజలు అపూర్వ మద్దతు తెలిపి, బిజెపి నాయకులకు స్వాగతం పలికారు. ఈ యాత్రలో బిజెపి శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ కొనసాగిన ఈ యాత్రలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర్ రావు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా… రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న విజయసంకల్ప యాత్రకు వస్తున్న స్పందన భారతీయ జనతా పార్టీ  సాధించబోయే ఘన విజయానికి నిదర్శనమని  బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ అన్నారు.  కృష్ణమ్మ క్లస్టర్ యాత్ర ముగింపు సందర్భంగా ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారన్నారు. 

అదేవిధంగా నేడు కొమురం భీం క్లస్టర్ లో విజయసంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా వివిధ డిపార్టమెంట్ల సిబ్బందిని, విజయసంకల్ప యాత్ర రథాల డ్రైవర్లు, క్లీనర్లను, సహాయకులను యాత్ర ప్రముఖ్ దుగ్యాల ప్రదీప్ కుమార్ ప్రత్యేకంగా సన్మానించి, మెమెంటోలు అందించి అభినందనలు తెలియజేశారు.