5 యాత్రలు… 5500 కిలోమీటర్లు…
భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్ర ఫిబ్రవరి 20న ప్రారంభమై మార్చి 2 వరకు కొనసాగుతుంది. ఈ యాత్ర తెలంగాణ రాష్ట్రంలో 5 విభాగాలుగా జరుగుతుంది. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా వరంగల్ వైపు జరిగే యాత్ర మూడు రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 20 నుండి 4 యాత్రలు కొనసాగుతాయి.
1) కొమరంభీం యాత్ర
ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంట్లలో కొమరంభీం విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. సుమారు 1,056 కి.మీ మేర 12 రోజులు జరుగుతుంది. 21 నియోజకవర్గాలల్లో ఈ యాత్ర కొనసాగుతుంది.
2) రాజరాజేశ్వర యాత్ర
కరీంనగర్, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్లలో 1,217 కి.మీ ఉంటుంది. 22 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ యాత్ర కొనసాగుతుంది.
3) భాగ్యనగర యాత్ర
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆశీస్సులుతో ఈ యాత్ర ప్రారంభమై భువనగరి, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్ గిరి పార్లమెంట్లలో ఈ యాత్ర సాగుతుంది.
4) కాకతీయ భద్రకాళి యాత్ర
సమ్మక్క సారక్క జాతర కారణంగా రెండు రోజులు ఆలస్యంగా భద్రాచలంలో ప్రారంభమవుతుంది. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్లలో 1,015 కి.మీ,7 రోజులు.. 21 నియోజకవర్గాలను కవర్ చేస్తుంది.
5) కృష్ణమ్మ యాత్ర
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ పార్లమెంట్లలో ఈ యాత్ర ఉంటుంది. 21 అసెంబ్లీ నియోజకవర్గాలలో 1,440 కి.మీ మేర యాత్ర కొనసాగనుంది.
సభలు మాత్రమే కాకుండా రైతులు, చేతి వృత్తులు, నిరుద్యోగలు, పొదుపు సంఘాల వారితో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ రోడ్ షోల ద్వారా యాత్ర ముందుకు వెళ్తుంది. అన్ని యాత్రలలో రోడ్ షోలు మాత్రమే ఉంటాయి. 5 యాత్రలు 17 పార్లమెంటు నియోజకవర్గాల ప్రజలను కలుస్తూ 5,500 కి.మీ సాగుతుంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో 114 నియోజకవర్గాల మీదుగా యాత్ర వెళ్తుంది. మొత్తం 5 యాత్రలల్లో 106 సమావేశాలు, 102 రోడ్ షోలు, 180 స్వాగత సభలు, 79 ఈవెంట్స్ ఉంటాయి. మార్చి 2న ఈ యాత్రలు పూర్తవుతాయి. ఈ యాత్రల ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సంస్కరణలు, చారిత్రాత్మక నిర్ణయాలు, దేశ గౌరవాన్ని ఇనుమడింపచేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తారు.