Modi at Adilabad

గత పదేళ్ళలో తెలంగాణకు అధిక కేటాయింపులు

 

Modi Adilabad Inaugurationతెలంగాణ ప్రజల కలలను నెరవేర్చేందుకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం సమకూర్చుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రాలను అభివృద్ధి పరచడం ద్వారా దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోవాలనేదే తమ మంత్రమన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్చ్ 4న ఆదిలాబాద్ లో రూ.56,000 కోట్లకు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన, జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఒక్క తెలంగాణకే కాకుండా, యావత్ దేశానికి సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులకు ఆదిలాబాద్ గడ్డ సాక్షిగా నిలిచిందన్నారు. ఈ రోజు రూ.56,000 కోట్లకు పైగా విలువ కలిగిన 30కి పైగా అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టామన్నారు. ఈ ప్రాజెక్టులో రాష్ట్రంలో శక్తి, పర్యావరణ మైత్రీపూర్వకమైన స్థిరాభివృద్ధి ప్రాజెక్టులకు తోడు రహదారి సంధానం ప్రముఖంగా ఉన్న ప్రాజెక్టులు భాగంగా ఉన్నాయన్నారు.

తెలంగాణ పట్ల ఇంతకు ముందు నిర్లక్ష్యం జరిగిన విషయాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. గత పదేళ్ళలో రాష్ట్రానికి అధిక కేటాయింపులు జరిగాయన్న విషయాన్ని వివరించారు. 

Kishan Reddy Modi

‘‘మా దృష్టిలో అభివృద్ధి సాధించడం అంటే అది నిరుపేదల, దళితుల, ఆదివాసీల, వెనుకబడిన వర్గాల, నిరాదరణకు గురైన వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించడమే’’ అని ప్రధాన మంత్రి అన్నారు. 25 కోట్లకు పైగా ప్రజలు పేదరికం నుండి బయటకు వచ్చారని, ఇందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కారణమని అన్నారు. గత మూడు నెలల కాలం లో 8.4 శాతం మేర వృద్ధి చెందిన ఒకే ఒక ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారతదేశం అని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి రేటు గురించి ప్రపంచంలో పలు దేశాలు మాట్లాడుకొంటున్నాయన్నారు. ‘‘ఈ విధమైన వేగంతో భారతదేశం ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నరు డాక్టర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు.