బ్రహ్మరాక్షసుల, ఆషాఢభూతుల సమూహమే ‘ఇండీ కూటమి’
ఆగస్ట్ 8 అర్ధరాత్రి తర్వాత కోల్ కతా లోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో జరిగిన అత్యంత ఘోరమైన, వర్ణింప శక్యంకాని నీచ, నికృష్టంగా ఒక వైద్యురాలి అత్యాచారం, హత్య, తదనంతరం సదరు కాలేజీ యాజమాన్యం, అధికార పార్టీ మమత బెనర్జీ టీఎంసీ గుండాల దుర్మార్గపు చర్యలతో యావత్ దేశం ఉలిక్కి పడింది. 30 ఏళ్లకు పైగా కొనసాగిన మార్క్కిస్ట్ పాలనలో పశ్చిమ బెంగాల్ లో హింసా ప్రవృత్తి వేళ్లూనుకుంది. తదనంతరం డజనుకు పైగా సంవత్సరాలు పిశాచ మనస్తత్వం గల నాయకురాలి పాలనలో హింస జడలు విప్పి…. మతోన్మాదం, రాజకీయ ఉన్మాదం, ప్రతీకార చర్యలు, హిందూ వ్యతిరేక ఘోరాలు వందల సంఖ్యలో జరిగాయి. ఒక మహిళా ముఖ్యమంత్రి పరిపాలనలో మహిళలపై దాడులు జరగడాన్ని యావత్ భారత సమాజం, ముఖ్యంగా మహిళా లోకం తీవ్రంగా అసహ్యించుకుంటోంది.
మానవత్వం సామాజిక స్పృహ కలిగిన పీజీ ట్రైనీ డాక్టర్ ఆర్జీ కార్ ఆసుపత్రిలో జరుగుతోన్న కొన్ని ప్రమాదకరమైన సంఘటనలను ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్తున్న క్రమంలో ఒక రాక్షస మూక ఆమెపై విరుచుకుపడింది. రాష్ట్ర ప్రభుత్వం, ఆసుపత్రి యాజమాన్యం బాధ్యతారాహిత్యంతో వ్యవహరించడంతో ఆ మూక మంచి భవిష్యత్తు ఉన్న ఆ ట్రైనీ డాక్టర్ ను బలాత్కరించింది, క్రూర మృగాలకు సైతం వణుకు పుట్టేందు ఘోరంగా హత్య చేసింది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటున్న ఈ హేయమైన చర్యకు వ్యతిరేకంగా యావత్ దేశంలో ప్రజలు, ముఖ్యంగా డాక్టర్లు, వైద్య సిబ్బంది పెద్దఎత్తున ఉద్యమాలు చేపట్టడం, మమత బెనర్జీ ప్రభుత్వం, గూండాల దుర్మార్గాలు ప్రజలకు తెలియజేసిన ప్రతిపక్ష బిజెపి పాత్రతో కోల్ కత హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. దీంతో బాధితురాలి కుటుంబానికి న్యాయం జరుగుతుందా అన్న అనుమానాలు వీగి, భరోసా దక్కింది. దేశవ్యాప్త ఆందోళనలను సుమోటోగా తీసుకొన్న సుప్రీం కోర్టు ఆగస్టు 20న ప్రాథమిక విచారణ జరిపి దేశంలోని ప్రతి జిల్లా నుండి రెండు గంటలకు ఒకసారి ఆందోళన సమాచారం తెలియజేయాలని ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వం, ఆసుపత్రి యాజమాన్యం పట్టుబట్టి ట్రైనీ డాక్టర్ కు 36 గంటల వరస డ్యూటీ వేసి, నిద్రకు తగిన వసతి, రక్షణ కల్పించకపోవడం గమనిస్తూ వారి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రాక్షస సంఘటనకు ప్రాథమిక బాధ్యులైనప్పటికీ, రాష్ట్ర ముఖ్యమంత్రి, హోం, వైద్య శాఖ మంత్రి అయిన మమత బెనర్జీ కేసును సీబీఐకి అప్పగించిన తర్వాత రోడ్డెక్కి న్యాయం కావాలని డిమాండ్ చేయడం చూసి సమాజం విస్తుపోయింది. ఎంతో పవిత్రమైన వైద్య వృత్తిలో ప్రావీణ్యం పొందుతూ ప్రజలకు సేవ చేయాలి, ప్రజల ఆరోగ్యం, బాగోగులు చూడాలన్న భావాలు కలిగిన యువతి జీవితం ఇంత దారుణంగా బలి కావడంపై సభ్య సమాజా ఘోషిస్తున్నా ఇండీ కూటమి పార్టీలు, మానవ హక్కుల సంఘాలుగా పేరు పెట్టుకున్న సంస్థలు, అభ్యుదయవాదులుగా చెప్పుకునే పలు మహిళా సంఘాలు నిరసన తెలపకపోవడం, ఆ ఘటనను ఖండించకపోవడం వాటి అసలు రంగుకు అద్దం పడుతోంది. బాధితురాలి స్థానంలో తన చెల్లో, కుమార్తో ఉన్నా రాజకీయం కోసం, మతోన్మాదుల కోసం మమత ఇదేవిధంగా ప్రవర్తించి ఉండేదని దేశ ప్రజలు భావిస్తున్నారు.
విశ్వ మానవాళి క్షేమాన్ని కాంక్షించే హైందవ సంస్కృతిని అవమానించేలా దేశ పార్లమెంటులో హిందువులంటే ‘‘హింస.. హింస… హింస… నఫ్రత్.. నఫ్రత్.. నఫ్రత్..’’ అంటూ అరిచిన ఆషాఢభూతి ప్రస్తుత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోల్ కత ఘోర ఘటనపై స్పందించకపోవడం, ఇంతకుముందు మాదిరిగా వెళ్లి బాధితులను పరామర్శించడం వంటివి చేయకపోవడం ఆయనలోని పచ్చి మతోన్మాద, ఓటుబ్యాంకు రాజకీయాల అమానవీయ నైజం, అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం. కొద్దికాలం క్రితమే సందేశ్ ఖాళీ ఘోర దుర్ఘటనలో మమత బెనర్జీ ప్రభుత్వం, టీఎంసీ దుర్మార్గాలపై ఇండీ కూటమి పార్టీల మౌనదీక్ష చూస్తే… మమత బ్రహ్మరాక్షసి అని, ఇండీ కూటమి అషాఢభూతుల సమూహమని అర్థమవుతోంది. గతంలో టీఎంసీ నాయకులపై నమోదైన కేసు విచారణల్లో బెంగాల్ వెళ్లిన సీబీఐ, ఈడీ అధికారులపై జరిగిన దుర్మార్గపు దాడులు అక్కడి శాంతిభద్రతల దుస్థితి, మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పాలన రాక్షసత్వానికి అద్దం పడుతోంది.
బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్య వ్యతిరేక మతోన్మాద పరిణామాలు, వాటి వెనక బలమైన విదేశీ శక్తుల ప్రమేయం, ఆ తర్వాత బంగ్లాదేశ్ లో హిందూవులతో సహా మైనార్టీలపై జరిగిన వందల సంఖ్యలో దాడులు, హత్యలు… వీటన్నింటినీ గమనిస్తూ… బంగ్లా పరిణామాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తూ… ప్రపంచంలోని బలమైన శక్తులతో దౌత్యపర చర్చలు సమర్థంగా నిర్వహిస్తూ… బంగ్లాదేశ్ లో ఇప్పుడు ఉన్న తాత్కాలిక ప్రభుత్వానికి దీటైన హెచ్చరిక చేస్తూ… ఇదే సమయంలో ప్రపంచ శాంతి కోసం ఉక్రెయిన్ – రష్యా యుద్ధ నివారణ కోసం ఉక్రెయిన్ కు వెళ్లి, ఆ దేశాధినేతతో చర్చలు జరిపి మన దేశానికే కాకుండా యావత్ ప్రపంచ క్షేమానికి పని చేస్తున్న నరేంద్ర మోదీ ప్రధానిగా ఉండడం మనకెంతో గర్వకారణం, సురక్షితం, విశ్వాసనీయం. కానీ ఈ బ్రహ్మరాక్షసుల, ఆషాఢభూతుల ఇండీ కూటమి మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూలదోయడానికి విదేశీ శక్తులతో కుట్రలు, కుతంత్రాలకు పన్నుతోంది. వీరి కుట్రల పట్ల యావత్ దేశం జాగురూకతతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.