1000 piller temple

మోదీ వచ్చాకే వేయి స్తంభాల గుడి పనులు

గత యూపీఏ హయాంలో నిర్లక్ష్యానికి గురైన వరంగల్ వేయి స్తాంభాల గుడి పునరుద్ధరణ పనులు మోదీ పగ్గాలు  చేపట్టాకే మొదలయ్యాయని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్ అన్నారు. 2021 సెప్టెంబర్ తర్వాత ఈ పనులు మరింత వేగవంతమయ్యాయని తెలిపారు. మార్చ్ 8న పవిత్ర శివరాత్రి పర్వదినాన పునరుద్ధరించిన ఓరుగల్లు ప్రతిష్టాత్మక వేయి స్తంభాల గుడిని భక్తులు, పర్యాటకులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేయి స్తంభాల గుడి పునరుద్ధరణలో పని చేసిన స్తపతులను సన్మానించారు. గౌరవసూచకంగా వారిపై పూలవర్షం కురిపించారు. ఈ ఆలయ  పునరుద్ధరణకు కృషి చేసిన ఏఎస్ఐ అధికారులనూ సన్మానించారు.

1000 piller temple

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘దేశ చరిత్రలో కాకతీయుల పాలనాకాలం స్వర్ణయుగం లాంటిది. వ్యవసాయం మొదలుకుని కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, చేతివృత్తులకు వారు ఇచ్చిన ప్రాధాన్యత ఈరోజు కూడా పరిశోధనాంశమే. అలాంటి కాకతీయుల కళా వైభవానికి ఇవాళ భక్తులకు అంకితమైన వేయి స్తంభాల మండపం ఓ మచ్చుతునక. 1163లో కాకతీయ రాజు రుద్రదేవుడు ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని నిర్మించారు. దీన్ని నిర్మించేందుకు 72 ఏళ్లు పట్టిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 1324-25లో తుగ్లక్ సైన్యం దాడిలో ఈ మందిరం కొంతమేర ధ్వంసమైంది. దీంతో పాటు ఈ మందిరంలో ఉన్న సూర్య, వాసుదేవ విగ్రహాలను తుగ్లక్ సైన్యం తీసుకెళ్లింది. మధ్యయుగ కాలం నాటి ఈ గుడి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కేంద్రంగా ప్రత్యేకతను చాటుకుంది. ఇక్కడున్న మండపంలో గ్రామసభలు, నాట్య కార్యక్రమాలు నిర్వహించుకునేవారు. 132 స్తంభాలున్న కల్యాణ మండపం ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు 2006లో దీన్ని కూల్చేశారు. నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించాను. అప్పుడు ఈ పరిస్థితి విని బాధ కలిగింది. దీంతో ప్రత్యేక దృష్టి సారించాను. ఆ తర్వాత వివిధ కారణాలతో పిల్లర్లు ఊగిసలాడుతూ ఉన్న ఈ వేయి స్తంభాల గుడి.. 40 ఏళ్ల క్రితం పూర్తిగా శిథిలమైంది. ఆ తర్వాత 2006 నుంచి దీన్ని పునరుద్ధరణ ప్రక్రియ ప్రారంభమైనా. అది నత్త నడకన సాగింది. వాస్తవానికి. వేయి స్తంభాల మండపం పునరుద్ధరణ ఓ ఛాలెంజింగ్ టాస్క్‌ గా మారింది. కూలిన స్తంభాలకు మార్కింగ్ చేయడం.. వాటి డాక్యుమెంటేషన్ చేయడం.. అవి ఎక్కడెక్కడ ఉండేవో ఫొటోలు తీసుకోవడం.. ఏఎస్ఐ వారికి ఓ సవాల్ గా మారింది. దీనికితోడు యూపీఏ హయాంలో.. ఈ ప్రాజెక్టు పునరుద్ధరణ కోసం ఏఎస్ఐకి సరైన నిధులు ఇవ్వలేదు. దీంతో పనులు ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు అన్నట్లు తయారయ్యాయి. మోదీ పగ్గాలు చేపట్టాక ఏఎస్ఐకి నిధులు వచ్చాయి. పనులు ప్రారంభమయ్యాయి.  2021 సెప్టెంబర్ తర్వాత ఈ పనులు మరింత వేగవంతమయ్యాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆలయ నిర్మాణంలో విశేష అనుభవం ఉన్న కళాకారులను (స్తపతులు) తీసుకురావడం, వారి సహాయంతో. డాక్యుమెంటేషన్ ఆధారంగా ఈ వేయి స్తంభాల గుడిని పునరుద్ధరణ ప్రక్రియ వేగవంతమైంది. వాళ్లందరికీ మనమంతా రుణపడి ఉండాలి. నంది విగ్రహం జీవం పోసుకున్నట్లుగా ఉంది. స్తపతులు అనారోగ్య సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. ఈ మహత్కార్యంలో భాగస్వాములై పని చేశారు. ధ్వంసమైన పిల్లర్ల స్థానంలో.. బ్లాక్ గ్రానైట్ తో అచ్చం పాతవాటిలా ఉండే స్తంభాలను వీరు తయారుచేశారు. మధ్యలో ఉన్న నంది విగ్రహం కూడా విదేశీయుల దురాక్రమణలో ధ్వసంమైతే.. దాన్ని కూడా అక్కడే అందంగా పునరుద్ధరించిన స్తపతులందరికీ హృదయపూర్వక అభినందనలు. 2006 నుంచి 2021 వరకు 50 శాతం పనులు పూర్తయితే… కేవలం ఈ రెండు సంవత్సరాల్లోనే మిగిలిన 50 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన చిన్నాచితకా పనులను కూడా త్వరలోనే పూర్తిచేస్తాం.’’ అని అన్నారు.

1000 pillar temple Puja

ప్రాచీన కట్టడాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందని, ఇలాంటి కట్టడాల గోడలపై రాతలు, చెక్కడాలు చేయడం వల్ల మన సంపదను మనమే పాడు చేసుకుంటున్నామని, ప్రభుత్వాలకు సహకరిస్తూ వీటిని కాపాడుకోవడాన్ని మన బాధ్యతగా భావించాలని అన్నారు. పునరుద్ధరణ పనుల ఆలస్యాన్ని వివరిస్తూ ఏఎస్ఐ అధికారులను చాలా పరిమితులున్నాయి, ఆ పరిమితుల్లోనే వాళ్లు పని చేస్తారు, ఆ కారణంగా కాస్త ఆలస్యమైన మాట వాస్తవమేనని అన్నారు.

వేయి స్తంభాల గుడి పునరుద్ధరణ సాధ్యమవుతుందా అనే అనుమానాలుండేవి, కిషన్ రెడ్డి చొరవ కారణంగానే ఇది సాధ్యమైంది, ఆయన కృషి కారణంగానే రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చింది, వారికి ధన్యవాదములు అని తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్ గారు, స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ప్రొఫెసర్ పాండురంగారావు, ASI అధికారులు పాల్గొన్నారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దంపతులు భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

గిరిజన విశ్వవిద్యాలయానికి తాత్కాలిక భవనం ప్రారంభం

Tribal University Opening

ఇదే రోజు కేంద్రమంత్రి  కిషన్ రెడ్డి సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తాత్కాలిక భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని తాత్కాలికంగా ప్రారంభించుకున్నామని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో భూమి కేటాయిస్తే యూనివర్సిటీ శాశ్వత భవన నిర్మాణం చేపడుతామన్నారు. ఈ గిరిజన యూనివర్సిటీకి రూ. 900 కోట్లు కేటాయించామని చెప్పారు. యూజీసీ అధ్వర్యంలో ఈ యూనివర్సిటీ కొనసాగుతుందని, గిరిజనుల జీవన విధానంపై పరిశోధనలు జరుగుతాయని అన్నారు. ‘‘2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి తరగతులు ప్రారంభమవుతాయి. యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుంది. భూకేటాయింపుల్లో అధికారులు వేగవంతమైన చర్యలు చేపట్టాలి. త్వరలోనే భూమి పూజా చేస్తాం. తెలంగాణలో 9.8 శాతం గిరిజన జనాభా ఉంది. వారిలో కేవలం 50 శాతం మాత్రమే అక్షరాస్యులు. గిరిజనుల్లో అక్షరాస్యతను పెంచాల్సిన అవసరం ఉంది.’’ అని అన్నారు.