Nadda at BJP National Convention

ప్రతిపక్షాల బాధ్యతా రాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళదాం

 

Nadda at BJP National Council

దిల్లీలో ఫిబ్రవరి 17, 18 తేదీల్లో జరిగిన బిజెపి జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు:

  • ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్టీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఆయన ఈ జాతీయ సదస్సు రెండు రోజుల సమావేశాలకూ హాజరై మార్గనిర్దేశం చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వం, మార్గదర్శకత్వం బిజెపి పార్టీ కార్యకర్తల అదృష్టం. ఆయన పార్టీ సంస్థాగత యంత్రాంగానికి నిరంతరం దిశానిర్దేశం చేస్తూ మార్గదర్శకత్వం వహిస్తున్నారు.
  • బిజెపి సీనియర్ నాయకుడు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతీయ సదస్సు తొలిరోజున ‘‘వికసిత్ భారత్, మోదీకి గ్యారెంటీ’’ అనే రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మోదీ చైతన్యవంతమైన, నిర్ణయాత్మక నాయకత్వంలో నడుస్తున్న బిజెపి ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాల విజయాలను రాజకీయ తీర్మానం వివరంగా తెలియజేసింది.
  • రెండవ తీర్మానాన్ని మన సీనియర్ నాయకుడు, కేంద్ర హోం, సహకార మంత్రి అమిత్ షా ‘దేశ్ కీ ఆశా ఔర్ విపక్ష్ కి నిరాశా’ అనే శీర్షికతో ప్రవేశపెట్టారు. బిజెపి కార్యకర్తలందరూ ఈ తీర్మానాలను లోతుగా, వివరంగా చదవాలి.
  • తీర్మానాన్ని ప్రవేశపెట్టేటప్పుడు కేంద్ర హోంమంత్రి వ్యక్తం చేసిన అభిప్రాయాలను బిజెపి కార్యకర్తలందరూ మన దేశ ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలి. గత 10 సంవత్సరాలలో ప్రతిపక్ష పార్టీల అసమర్థ, బాధ్యతారాహిత్య ప్రవర్తన గురించి అమిత్ షా తన అభిప్రాయాలను వివరంగా తెలియజేశారు. 
  • కేంద్ర హోంమంత్రి ప్రకటనలో బిజెపి కార్యకర్తలు పది మందిలో చెప్పాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. బిజెపి కార్యకర్తలు అమిత్ షా ప్రసంగం నుండి ప్రసంగ అంశాలను తీసుకోవాలి. వాటిపై వివరంగా రాజకీయ చర్చలు జరపాలి. ప్రతిపక్ష పార్టీల వైఫల్యాలు, అసమర్థతలను ఎత్తిచూపడంతోపాటు గత 10 ఏళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన అద్భుతమైన విజయాలను ఈ అంశాలు సూచిస్తున్నాయి. మనమందరం ప్రతిపక్ష పార్టీల వైఫల్యాలను దేశ ప్రజల ముందు బయట పెట్టాలి. 
  • అదేవిధంగా సీనియర్ ప్రతిపక్ష నాయకుల నిర్లక్ష్యాన్ని, అసమర్థ వ్యవహారశైలిని కూడా మనం ప్రముఖంగా ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలి. గత పదేళ్లలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించడంలో ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయి. మనం ఈ అంశాలను పూర్తి స్పష్టతతో, నమ్మకంతో దేశ ప్రజల ముందు ఉంచాలి.
  • బిజెపి కార్యకర్తలు కూడా శ్రీరామ జన్మభూమిపై పార్టీ విజయాలను తగిన సందర్భాల్లో ఉపయోగించుకోవాలి.
  • బిజెపి సీనియర్ నాయకురాలు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జాతీయ సదస్సులో ప్రసంగిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, మార్గదర్శకత్వంలో భారత్ ఎలా బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందో, భారత్ ఆర్థిక సవాళ్ళను ఎదుర్కోవడంలో ప్రపంచానికి ఎలా దారి చూపుతోందో వివరంగా మాట్లాడారు. బిజెపి కార్యకర్తలందరూ ఈ సందేశాన్ని దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
  • పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగం ప్రభుత్వం సాధించిన విజయాలను వివరంగా తెలిజేస్తుంది. బిజెపి కార్యకర్తలందరూ రాష్ట్రపతి ప్రసంగాన్ని లోతుగా అధ్యయనం చేసి పంచాయితీ, బూత్ స్థాయిలలో దాని గురించి వివరంగా చర్చించాలి.
  • లోక్‌సభ, రాజ్యసభలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంపై కూడా బిజెపి కార్యకర్తలు చర్చించాలి. పార్లమెంటు కార్యకలాపాలకు పదే పదే అంతరాయం కలిగించడం ద్వారా ప్రతిపక్ష పార్టీలు దేశంలో ఉన్నత ప్రజాస్వామ్య విలువలను ఎలా దెబ్బతీశాయో, కించపరిచాయో ప్రధాన మంత్రి బిజెపి కార్యకర్తలకు చెప్పారు.
  • కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యుపిఎ ప్రభుత్వంపై ఎన్డీయే ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం వారి పదేళ్ల పాలనలో ఆర్థికరంగంలో జరిగిన ఘోర తప్పిదాలు, అవినీతి, బంధుప్రీతి, దుష్పరిపాలనను తేటతెల్లం చేసింది. యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలను శ్వేతపత్రం వివరంగా చర్చించింది. బిజెపి కార్యకర్తలు ఈ శ్వేతపత్రాన్ని పంచాయితీ, మండలం, బూత్ స్థాయిలకు తీసుకెళ్లి యుపిఎ, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల నిజస్వరూపాన్ని ప్రజలకు తెలియజేయాలి.
  • బిజెపి కార్యకర్తలందరూ జాతీయ సదస్సులో చేసిన తీర్మానాలను కూలంకషంగా అధ్యయనం చేసి దేశ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఈ తీర్మానాలు ‘మంత్రం’లా పని చేస్తాయి.
  • పార్టీ జాతీయ సదస్సుకు ముందు, బిజెపి జాతీయ పదాధికారుల సమావేశంలో రానున్న లోక్‌సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పనుల కేటాయింపు, ప్రణాళికలపై కూడా చర్చించాం. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు.