2025 మహా కుంభమేళా 144 సంవత్సరాల అతిపెద్ద పండుగ
మహా కుంభమేళా అన్ని కుంభమేళాలో అతిపెద్దది, అత్యంత పవిత్రమైనది. మహా కుంభమేళా కేవలం ప్రయాగ్‌రాజ్‌లోనే 144 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఒకసారికి మించి మహా కుంభమేళాలో పాల్గొనే అవకాశం రాదు. పైగా 144 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది కాబట్టి, అందరికీ కూడా ఈ అవకాశం రాదు. ఈసారి కుంభమేళా పుష్య మాసం పౌర్ణమి అయిన జనవరి 13న రాజ స్నానంతో ప్రారంభమై ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగుస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవంగా కుంభమేళా ప్రసిద్ధి. యునెస్కో కుంభమేళాను ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది.
కుంభం అంటే కుండ అని అర్థం. దీనికి కలశం అనే అర్థం కూడా ఉంది. భారత ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం ఒక రాశిని కూడా సూచిస్తుంది. ఈ రాశిలోనే ఈ పండుగ నిర్వహిస్తారు. మేళా అంటే జాతర అని అర్థం. అందుకే దీనిని కుంభమేళా అని అంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక, సామాజిక, పవిత్ర, మత కార్యక్రమం కుంభమేళా. కుంభమేళాలు 5 రకాలు. మొదటిది మహా కుంభమేళా, ఇది 144 ఏళ్లకు ఒకసారి కేవలం ప్రయాగ్‌రాజ్‌లోనే జరుగుతుంది. రెండవది పూర్ణ కుంభమేళా, ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి దేశంలోని 4 విశిష్ట నగరాలైన ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లలో ఒక దాని తర్వాత మరొకటి వస్తుంది. మూడవది అర్ధ కుంభమేళా, అర్ధ కుంభమేళా అంటే సగం కుంభం, 12 సంవత్సరాల్లో సగం అనగా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్, ప్రయాగ్‌రాజ్‌లో మాత్రమే నిర్వహిస్తారు. నాలుగవది కుంభమేళా, ఇది ఉజ్జయిని, ప్రయాగ్‌రాజ్, నాసిక్, హరిద్వార్ ప్రాంతాల్లో 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చే భక్తి, అధ్యాత్మిక కార్యక్రమం. ఐదవది మాఘమేళా, దీనిని మినీ కుంభమేళా అని కూడా అంటారు, దీనిని ఏటా మాఘ మాసంలో ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తారు.
పురాణాలు, వేదాలలో కూడా కుంభమేళా ప్రస్తావన ఉంది. కుంభమేళాకు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు స్పష్టమవుతోంది. మత్స్య పురాణంలో సాగర మథనం కథ ప్రకారం అమృత కలశం సొంతం చేసుకునేందుకు దేవతల, రాక్షసుల మధ్య జరిగిన 12 ఏళ్ల యుద్ధంలో లభించిన అమృత కలశం నుంచి 4 ప్రాంతాల్లో చిందిన బిందువుల కారణంగా పైన పేర్కొన్న 4 ధార్మిక నగరాల్లో కుంభమేళా ఉత్సవాలు జరుగుతాయి. కుంభమేళా నిర్వహణలో బృహస్పతి గ్రహ స్థితికి చాలా ప్రాధాన్యం ఉంది. క్రీ.శ. 629-645 మధ్యన హర్షుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హ్యుయాన్ త్సాంగ్ కుంభమేళా గురించి ప్రస్తావించారు.
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వాల పాలనలో జరుగుతున్న ఈ విశిష్ట కుంభమేళా ప్రపంచంలోని యావత్ హిందువుల దృష్టిని ఆకర్షిస్తోంది. గత పూర్ణ కుంభమేళా 2013 జనవరి, ఫిబ్రవరిలో జరగగా, అప్పుడు కేంద్రంలో హిందూ వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం, ఉత్తర ప్రదేశ్ లో హిందూ వ్యతిరేక సమాజ్‌వాదీ ప్రభుత్వం ఉండడం వల్ల కుంభమేళా ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షునిగా ఇస్లామిక్ మతోన్మాది, హిందూ ద్వేషి ఆజం ఖాన్‌ను నియమించారు. 10 ఫిబ్రవరి 2013న ప్రయాగ్‌రాజ్ (అప్పటి అలహాబాద్) రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 42 మంది మృతి చెందడం, దాదాపు 50 మంది గాయపడడం అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్గనైజింగ్ కమిటీల వైఫల్యంగా అందరూ గుర్తించారు. పరిస్థితుల కారణంగా ఆజం ఖాన్ ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినా, అప్పటి యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ అత్యంత హేయంగా ఆజం ఖాన్‌ను మెచ్చుకుంటూ రాజీనామాను తిరస్కరించారు. ఇప్పుడు ఆ రెండు పార్టీలు, ఆ రెండు స్థానాల్లో అధికారం కోల్పోడానికి వాళ్ల హిందూ వ్యతిరేక దుర్మార్గ చర్యలే ప్రధాన కారణమని యావత్ దేశ ప్రజానీకం విశ్వసిస్తోంది.
100 సంవత్సరాల ఆరెస్సెస్, ఇతర హిందూ పరివార్ క్షేత్రాల సంస్థల విశిష్ట కృషి, ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్‌పేయి, నరేంద్ర మోదీ కృషి ఫలితంగా ఏర్పడ్డ హిందూ సానుకూల వాతావరణంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ప్రపంచ నలుమూలల నుంచి దాదాపు 50 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని హిందూ మేధావి వర్గం భావిస్తోంది. సశాస్త్రీయమైన హిందూ సంస్కృతి ఉత్సవాల్లో ఈసారి డిజిటల్ సహకారంతో ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలను ఉపయోగించుకొని పర్యావరణహితంగా జరపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టుదలగా ఉన్నాయి. ఈ ఉత్సవాల సమయంలో సాధారణంగా నడిచే 6580 రైళ్లతో పాటు అదనంగా 1000 రైళ్ల వరకు నడపాలని రైల్వే బోర్డు ప్రణాళికలు సిద్ధం చేసిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సంతోషకరంగా తెలిపారు.
ఈ అద్భుత, సానుకూల పరిస్థితుల్లో వచ్చిన విశేష అవకాశాన్ని వినియోగించుకొని, ఈ ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో సంప్రదాయ ప్రకారం పాల్గొని, పుణ్యాలను అర్జించి, పవిత్రతను పెంపొందించుకొని, జీవితం ధన్యం చేసుకోవాలని విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రతి హిందువును, హిందూ అభిమానులను బిజెపి తెలంగాణ సవినయంగా విజ్ఞప్తి చేస్తోంది.