నక్సలైట్లు, జిహాదీలు, మత కలహాల నిర్మూలనలో మోదీ విజయం
స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ నెహ్రూ కుటుంబ పెత్తనంలో కాంగ్రెస్ అనుసరించిన జిహాదీ అనుకూల, హిందూ వ్యతిరేక నిర్ణయాలు, చర్యలతో దేశ విభజన, ఆ సమయంలో 10 లక్షల హిందువుల ఊచకోత, తదనంతర కాలంలో వేలాది మతకలహాలు, కోట్లాది మత మార్పిడులు దేశవ్యాప్తంగా జరిగాయి. నెహ్రూ హయాంలో తీసుకున్న ఆర్టికల్ 370, మైనార్టీ కమిషన్, ముస్లిం పర్సనల్ లా బోర్డ్, వక్ఫ్ చట్టం, ఆ తరువాత ప్రార్థనా స్థలాల చట్టం లాంటి ఎన్నో మతోన్మాద హిందూ వ్యతిరేక చట్టాల కారణంగానూ స్వదేశంలోనే కశ్మీరీ పండిట్ల వేలాది హత్యలు, లక్షలాది వ్యక్తుల వలసలు, ఇంకెన్నో దారుణాలు జరిగాయి. దశాబ్దాలుగా కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకున్న నక్సల్స్ దేశవ్యాప్తంగా విస్తరించి, దాదాపు 400 జిల్లాల్లో లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం, వేలాది హత్యలు, మరెన్నో దారుణాలకు పాల్పడ్డారు.
కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2004లో అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ఉగ్రవాద నిరోధక చట్టం తొలగింపుతో జిహాదీల వందలాది బాంబు బ్లాస్టులు దేశవ్యాప్తంగా జరిగాయి. మొదటి నుంచీ కాంగ్రెస్ అనుసరించిన పాకిస్తాన్ అనుకూల విధానంతో దాయాది దేశం మన డబ్బుతోనే ఇస్లామిక్ ఉగ్రవాదులను పెంచి, పోషించి ఎన్నో దారుణాలకు కారణమైంది. ముంబైలో కసబ్ గ్యాంగ్ జరిపిన దారుణ మారణకాండ దానికొక మచ్చుతునక. కాంగ్రెస్ పాలనలో దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో వందలాది మతకలహాలు జరిగి, వేలాది మంది మరణించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థతను, ఆ పార్టీ నీచ ఓటుబ్యాంకు రాజకీయాలను ప్రతిబింబిస్తుంది.
వాజ్‌పేయి నాయకత్వంలో బిజెపి అధికారంలోకి రాకమునుపే రామజన్మ భూమి ఉద్యమంతో హిందూ చైతన్య యాత్రలు, కార్యక్రమాలు జరగడంతో వంద సంవత్సరాల క్రితం డాక్టర్ జీ స్థాపించిన ఆర్ఎస్ఎస్ ఫలితాలను ఇవ్వడం ప్రజలకు కనిపించింది. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బాంబు పేలుళ్ల నియంత్రణ సమర్థవంతంగా కొనసాగింది. మత కలహాలను అరికట్టడంలోనూ సఫలీకృతం అయ్యింది. ముఖ్యంగా 2019లో అమిత్ షా హోం మంత్రి అయ్యాక ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామజన్మ భూమిలో రామాలయ నిర్మాణం ప్రారంభం, సీఏఏ చట్టం తీసుకురావడం, ట్రిపుల్ తలాక్ రద్దుతో జిహాదీ మనస్తత్వాలకు కోలుకోలేని దెబ్బతగిలింది. అప్పటివరకు ఆర్టికల్ 370ని రద్దు చేసినా, రామాలయ నిర్మాణం జరిగినా, ట్రిపుల్ తలాక్ రద్దు చేసినా, సీఏఏ చట్టం తెచ్చినా దేశంలో రక్తం ఏరులై పారుతుందని కొనసాగించిన దుష్ప్రచారం పచ్చి అబద్ధమని రుజువైంది. అంతేకాకుండా కశ్మీర్ లో శాంతి నెలకొనడం, దేశవ్యాప్తంగా హిందూ చైతన్యం వెల్లివిరియడం, బంగ్లాదేశ్, రోహింగ్యా ముస్లింల వలసలపై ప్రజల్లో జాగురూకత వ్యక్తం కావడంతో ఉగ్రవాద చర్యలు, మతకలహాలు చాలా వరకు నియంత్రణలోకి వచ్చాయి.
2016 నవంబర్ లో పెద్దనోట్ల రద్దు, యూరీ దాడితో జరిగిన సర్జికల్ స్ట్రైక్, పుల్వామా ఉగ్రదాడితో జరిగిన బాలాకోట్ వైమానిక దాడులతో పాకిస్తాన్‌ను ఆర్థికంగా, సైనిక పరంగా, దౌత్యపరంగా కోలుకోలేని దెబ్బతీసి, ఈ రోజు ఆ దేశం బిచ్చమెత్తుకునే స్థితికి తీసుకురావడం మోదీ ప్రభుత్వం సాధించిన అద్భుత విజయం. 2005లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో జానారెడ్డి హోం మంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్ వ్యతిరేక దళాలు, నక్సలైట్ నాయకుడు రామకృష్ణను చుట్టముట్టినప్పుడు అర్బన్ నక్సల్ వరవరరావు సహా కొంతమంది జానారెడ్డిని కలవడం, నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌ను ఉపసంహరించుకోమని ఒత్తిడి తేవడం, అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తున్న టీఆర్ఎస్ ముఖ్యనాయకులు కూడా దానికి మద్దతు తెలపడంతో కాంగ్రెస్ – టీఆర్ఎస్ నాయకులు నక్సల్స్‌తో ఏవిధంగా కుమ్మక్కయ్యారన్న విషయం బహిర్గతమైంది. నక్సలిజం యావత్ సమాజానికే భయంకర శత్రువని గ్రహించిన మోదీ ప్రభుత్వం 2014 నుంచి నక్సలిజాన్ని నిర్మూలించడానికి అవసరమైన అన్ని చర్యలు సమర్థవంతంగా తీసుకోవడంతో, ఈ వారంలో నక్సలైట్ ముఖ్యనాయకుడు చలపతి ఎన్కౌంటర్ వరకు వందలాది ఎన్కౌంటర్లలో వేలాది నక్సలైట్ల హతమవడం బిజెపి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. 31 మార్చ్ 2026 వరకు నక్సలైట్లను సమూలంగా నిర్మూలించాలన్న ప్రస్తుత హోం మంత్రి అమిత్ షా ప్రతిజ్ఞ మోదీ ప్రభుత్వ ప్రజాహిత, దేశ సురక్ష ప్రణాళికల అమలుకు, ఫలితాలకు అద్దం పడుతుంది. కాంగ్రెస్ హయాంలో నిషేధిత మావోయిస్టు సభ్యుడిగా ఉండి దశాబ్దాల పాటు ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహించారంటే కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ, దేశవ్యతిరేక కుట్రలకు నిదర్శనం. ఇటీవల జరిగిన నక్సల్స్ ఎన్కౌంటర్లు కమ్యూనిస్టు ఉగ్రవాదుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా కొత్త రిక్రూట్మెంట్లను పూర్తిగా ఆపుతూ, వేలాది నక్సల్స్ లొంగుబాటును ప్రోత్సహిస్తూ ‘‘2014 నుంచి సురక్షిత భారత్ గా రూపాంతరణ’’ అన్న ప్రముఖుల కామెంట్లను రుజువు చేస్తుంది.
పైన పేర్కొన్న విధంగా మత కలహాల నివారణలోనూ, జీహాదీ ఉగ్రవాద నియంత్రణలోనూ, నక్సలిజం నిర్మూలనలో మోదీ ప్రభుత్వం అద్భుత విజయాలను సాధించి రోజురోజుకూ ప్రజల విశ్వాసాన్ని మరింత చూరగొంటున్నది అన్నది అక్షరసత్యం.