Narendra Modi

రాష్ట్రాల అభివృద్ధి ద్వారా దేశాభివృద్ధి

 

Modi G. Kishan Reddy

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్చ్ 5న సంగారెడ్డిలో రూ.6,800 కోట్లకు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు, జాతికి అంకితం ఇచ్చారు. ఈ ప్రాజెక్టులు రహదారులు, రైల్వే, పెట్రోలియం, విమానయానం, సహజ వాయువు వంటి ముఖ్య రంగాలలో విస్తరించి ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, రాష్ట్రాల అభివృద్ధి ద్వారా దేశ అభివృద్ధి అనే మంత్రాన్ని విశ్వసిస్తానని అన్నారు. ఆ స్ఫూర్తితో తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం పాటుపడుతోందన్నారు.

హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సిఎఆర్ఒ) కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రం తెలంగాణకు విమానయాన రంగంలో ఒక పెద్ద బహుమతి అని అభివర్ణించారు. ఇది దేశంలో విమానయాన రంగానికి సంబంధించిన స్టార్ట్-అప్స్ కు పరిశోధన, అభివృద్ధి సౌకర్యాలతో కూడిన ఒక వేదికను ప్రసాదిస్తుందని వివరించారు. ఈ సంవత్సరం బడ్జెటులో మౌలిక వసతులకు రూ.11 లక్షల కోట్లు కేటాయించడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ కేటాయింపు తాలూకు గరిష్ట ప్రయోజనాలను తెలంగాణకు అందించే ప్రయాసలో భాగంగా ఎన్‌హెచ్-161లో కంది నుండి రాంసాన్ పల్లి సెక్షను, ఎన్‌హెచ్-167లోని మిర్యాలగూడ-కోదాడ సెక్షన్ ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ మధ్య రవాణా సదుపాయాలను మెరుగు పరుస్తాయని తెలిపారు. ‘‘దక్షిణ భారతానికి ప్రవేశ ద్వారంగా తెలంగాణ పేరు తెచ్చుకొంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. రైలు మార్గాల విద్యుదీకరణ, డబ్లింగు పనులు శరవేగంగా చోటు చేసుకొంటున్నాయని అన్నారు.

ఇండియన్ ఆయిల్ కు చెందిన పారాదీప్ – హైదరాబాద్ ప్రాడక్ట్ పైప్ లైనునూ ప్రారంభించారు. ఈ పైప్ లైను పెట్రోలియమ్ ఉత్పత్తులను చౌకగా, పర్యావరణహితంగా ఉండే పద్ధతిలో చేరవేస్తుందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నరు డాక్టర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.