Hamara Sankalp Vikasit Bharat
G. Kishan Reddy

సికింద్రాబాద్ ప్రజలకు కిషన్ రెడ్డి నివేదిక

G. Kishan Reddy reportబిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి 2004లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తన పదవీకాలం కాలంలో తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి నియోజకవర్గ ప్రజలకు వివరించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికలలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్న సందర్భంగా, గత 5 సంవత్సరాల పదవీ కాలంలో పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో, తెలంగాణలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఏప్రిల్ 18న నివేదికను నియోజకవర్గ ప్రజల ముందు ఉంచారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ నరసింహారెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత హనుమంతరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌ పాశం యాదగిరి సహా పలువురు బిజెపి ముఖ్యనేతలు పాల్గొన్నారు.

ఈ నివేదికలోని ప్రధాన అంశాలను గమనిస్తే, గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి పన్నుల వాటా పంపిణీ కింద అందించిన నిధులు, కేంద్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కింద తెలంగాణలో ఖర్చు చేసిన నిధులు, రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులకు వివిధ పథకాల కింద అందించిన రుణాలకు చెల్లించిన వడ్డీ రాయితీ, రైతులకు కనీస మద్దతు ధరను చెల్లించి పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులను ప్రస్తావించారు. అందులో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున నిర్మాణం చేపడుతున్న జాతీయ రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణం, కాజీపేటలో నిర్మిస్తున్న రైల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్, వరంగల్ లో ఏర్పాటు చేయనున్న పీఎం మిత్ర టెక్స్ టైల్స్ పార్కు, రామగుండంలో కొత్తగా నిర్మించిన ఎరువుల కర్మాగారం, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్లు, హైదరాబాద్ మెట్రోకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద అందించిన నిధులు, సిద్ధిపేట జిల్లా ములుగులో నిర్మించిన శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం, ములుగు జిల్లాలో ఏర్పాటు చేయనున్న సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, బీబీనగర్ ఎయిమ్స్, హైదరాబాద్ ఐఐటీ, పశువుల ఔషధాల మీద పరిశోధనల కోసం నిర్మించిన దక్షిణాసియాలోనే అతిపెద్ద బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్, కరోనా సమయంలో మొదలు పెట్టిన ఉచిత రేషన్ బియ్యం పంపిణీ, వ్యాక్సినేషన్, రైతులకు సబ్సిడీ కింద అందిస్తున్న ఎరువులు వంటి అనేక అంశాలను క్లుప్తంగా వివరించారు.

GKR report releaseఅనంతరం సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడిగా జంట నగరాల పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించారు. అందులో ముఖ్యంగా సికింద్రాబాద్, కాచీగూడ, నాంపల్లి, బేగంపేట తదితర రైల్వేస్టేషన్లను విమానాశ్రయాల తరహాలో ఆధునీకరిస్తున్న విషయాన్ని, చర్లపల్లిలో నిర్మిస్తున్న నూతన రైల్వే టెర్మినల్ గురించి, గత దశాబ్ద కాలంగా కొనసాగుతూ వస్తోన్న MMTS ఫేజ్-II పనులను పూర్తి చేసి సర్వీసులను ప్రారంభించడమే కాకుండా, ఈ ప్రాజెక్టును యాదాద్రి వరకూ పొడిగించి 100 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించనున్న విషయం గురించి, జంట నగరాల నుంచే ప్రారంభించిన 4 వందే భారత్ రైళ్లు, హైదరాబాద్ నగరానికే తలమానికంగా నిలవనున్న రీజనల్ రింగ్ రోడ్డు, దాని చుట్టూ నిర్మించడానికి ఫైనల్ లొకేషన్ సర్వే జరుపుకుంటున్న ఔటర్ రింగ్ రైల్, అలాగే సికింద్రాబాద్ నుంచి చేపట్టనున్న వివిధ రైల్వే ప్రాజెక్టులు, నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి నిర్మిస్తున్న వివిధ రహదారి ప్రాజెక్టులు, సనత్ నగర్ లో నిర్మిస్తున్న ESIC మెడికల్ కాలేజీ, ఆసుపత్రి, ఆయుష్మాన్ భారత్ హెల్త్ & వెల్ నెస్ సెంటర్ల ద్వారా నగరంలోని బస్తీ దవాఖానాలలో చేసిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించడం, ప్రజలకు అతి తక్కువ ధరలకే మందులు అందుబాటులో ఉంచడానికి జన ఔషధీ కేంద్రాల ఏర్పాటు, వివిధ పథకాల కింద నగర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థలలో మౌలిక సదుపాయాల కల్పన, క్రీడా వసతులను మెరుగుపరచడం, నూతన పరిశోధనలను పెంపొందించడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్ లు, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటు, యువత, మహిళల కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు, పని చేస్తున్న మహిళల కోసం వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణం, ఉస్మానియా యూనివర్శిటీలో ఎస్సీ హాస్టళ్ల నిర్మాణానికి చర్యలు, ఖేలో ఇండియా సెంటర్ల ఏర్పాటు, మహిళల సంరక్షణ కోసం నిర్భయ పథకం కింద రక్షణ చర్యలు, దివ్యాంగులకు సహాయ పరికరాల పంపిణీ కోసం చేపట్టిన ప్రత్యేక క్యాంపులు, కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి నగర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి, కరోనా సోకిన వారిలో ధైర్యాన్ని నింపి, ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు, ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు, వ్యాక్సినేషన్  కేంద్రాలలో పర్యటించి వ్యాక్సినేషన్ వేగవంతం కోసం తీసుకున్న చర్యలు వంటి అనేక అంశాలను కిషన్ రెడ్డి వివరించారు.

అంతేకాకుండా, పార్లమెంటు సభ్యుడికి అందించే ఎంపీ నిధులతో, వివిధ సంస్థల సహకారంతో పార్లమెంటు నియోజకవర్గవ్యాప్తంగా చిన్న చిన్న కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి అనువుగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాళ్లు, నీటి అవసరాలను తీర్చడానికి పవర్ బోర్ వెల్ లు, ప్రజల శారీరక ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఓపెన్ జిమ్ లు, పాఠశాలలు, కళాశాలలలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్ లు, పంపిణీ చేసిన బల్లలు, టాయిలెట్ క్లీనింగ్ మెషీన్లు, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పోషణ్ అభియాన్ స్ఫూర్తితో నియోజకవర్గ వ్యాప్తంగా మహిళల ఆరోగ్యం కోసం పోషణ్ కిట్ల పంపిణీ, వివిధ ఆసుపత్రులకు అందించిన అంబులెన్స్ లు, పశువులకు ఇంటి వద్దనే వైద్య సేవలను అందించటం కోసం మొబైల్ పశు సేవా కేంద్రాల ఏర్పాటు, ఖేలో సికింద్రాబాద్ – జీతో సికింద్రాబాద్ కింద యువతకు క్రీడా పోటీల నిర్వహణ, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ & మానిటరింగ్ కమిటీ ఛైర్మన్ గా కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం స్వనిధి, ముద్ర యోజన, స్టాండ్ అప్ ఇండియా, పీఎం జన్ వికాస్ తదితర కార్యక్రమాల కింద పెద్ద ఎత్తున రుణాలు అందించేలా తీసుకున్న చర్యలు, కార్మికుల కోసం ఈ-శ్రమ్ కార్డుల నమోదు, పంపిణీ వంటి అనేక చర్యలను గురించి వివరించారు.

ఈ కార్యక్రమాలకు అదనంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అందులో ముఖ్యంగా సైన్స్ సిటీ, రాంజీ గోండ్ గిరిజన మ్యూజియం ఏర్పాటుకు చర్యలు, హెరిటేజ్, ట్రైబల్, ఎకో టూరిజం సర్క్యూట్ ల అభివృద్ధి, ప్రసాద్ పథకం కింద బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం, రామప్ప ఆలయం, ఆలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయాల అభివృద్ధి, వేయిస్తంభాల గుడి పునరుద్ధరణ, ఉస్మానియా, గోల్కొండ కోట, చార్మినార్, ట్యాంక్ బండ్, వరంగల్ కోట వైభవాన్ని ప్రతిబింబించేలా ఇల్యూమినేషన్, సౌండ్ & లైట్ షో, తెలంగాణ ఘనమైన సాంస్కృతిక చరిత్ర, వారసత్వాన్ని ప్రతిబింబించేలా సంగీత నాటక అకాడమీ దక్షిణ భారత ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు, కళా ప్రదర్శనకు గాన గంధర్వ ఘంటసాల భారత్ కళా మండపం ఏర్పాటుకు చర్యలు, సాలార్జంగ్ మ్యూజియంలో 5 కొత్త గ్యాలరీల నిర్మాణం, డిజిటల్ ఎపిగ్రఫీ మ్యూజియం ఏర్పాటుకు చర్యలు, మింట్ మ్యూజియం ఏర్పాటు, సమ్మక్క సారక్క మేడారం జాతర నిర్వహణకు నిధులు వంటి అనేక అంశాలను గురించి, అంతర్జాతీయ యోగా దినోత్సవం, శ్రీనగర్ లో జి-20 సమావేశాల నిర్వహణ, జాతీయ సంస్కృతి మహోత్సవాల నిర్వహణ, హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించడమే కాకుండా, ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా గెజిట్ నోటిఫికేషన్ విడుదల, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణ వంటి అనేక కార్యక్రమాలను కిషన్ రెడ్డి వివరించారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై గతంలో ముఖ్యమంత్రికి 40 సార్లు లేఖలు రాసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందకపోయినా పట్టువదలకుండా సికింద్రాబాద్ నియోజకవర్గం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా భాద్యతాయుతంగా కృషి చేశానని, ప్రజలు, ప్రధానమంత్రి నాపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేస్తూ నీతిగా, నిజాయితీగా, జవాబుదారీతనంగా వ్యవహరించానని, అందులో భాగంగానే తన ఈ ప్రోగ్రెస్ రిపోర్టును నియోజకవర్గ ప్రజల ముందు ఉంచుతున్నాని అన్నారు. అత్యధిక మెజారిటీతో గెలిపించి నియోజకవర్గ, రాష్ట్ర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్ళే అవకాశాన్ని కల్పించాలని కోరారు.