స్వయంసమృద్ధ భారత్‌ను సాకారం చేసే కార్మిక సంస్కరణలు


దశాబ్దాలుగా భారత్ బలహీనమైన ఆర్థిక వృద్ధి, వేళ్లూనుకున్న అవినీతి, ఉద్యోగ కల్పన, కార్మికుల సంక్షేమంపై నిబద్ధత లేమితో కొట్టుమిట్టాడింది. రాజకీయ ప్రేరేపిత ఘెరావ్ లు, బంద్‌లు పారిశ్రామిక కార్యకలాపాలను అడ్డుకుంటూ, పెట్టుబడులను నిలిపివేసి వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీశాయి. గత ప్రభుత్వాలు కార్మిక సంక్షేమాన్ని...