Women Empowerment 00

మహిళల జీవితాల్లో పెనుమార్పులు తెచ్చిన మోదీ పాలన

త దశాబ్ద కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో నారీ శక్తి సమూలమైన మార్పులకు గురయ్యింది. మహిళా దేశాధినేత నేతృత్వంలోని ప్రపంచంలోని 15 దేశాలలో ఒకటిగా మహిళల సాధికారత, సమానత్వం రంగాల్లో విజయాలు సాధిస్తూ భారతదేశం సగర్వంగా నిలుస్తోంది. అంతేకాదు, ప్రపంచవ్యాప్త సగటు కంటే 10 శాతం ఎక్కువ మహిళా పైలట్‌లతో సాంప్రదాయకంగా పురుషాధిపత్యం ఉండే వృత్తులలో మూస పద్ధతులను విచ్ఛిన్నం చేసి భారతదేశం ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలిచింది. వివిధ సామాజిక, ఆర్థిక రంగాల్లో లోతుగా పాతుకుపోయిన తరతరాల అసమానతలను తొలగించడంలో, మహిళలు, బాలికల సాధికారతను పెంపొందించడంలో ప్రభుత్వ కార్యక్రమాలు కీలక పాత్ర పోషించాయి. బేటీ బచావో బేటీ పఢావో వంటి పథకాల ద్వారా దేశవ్యాప్తంగా బాలికలకు విద్య, సాధికారత విలువ, ప్రాముఖ్యతకు సంబంధించిన వైఖరుల్లో గణనీయమైన సానుకూల మార్పు వచ్చింది. దీని ఫలితంగా ప్రాథమిక, మాధ్యమిక విద్యలో అమ్మాయిలు, అబ్బాయిల మధ్య స్థూల నమోదు నిష్పత్తి (జిఇఆర్)లో సమానత్వం నెలకొంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ‘స్టెమ్’ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) రంగాలలో 43 శాతం మంది మహిళలకు కీలక ప్రాతినిధ్యం లభించింది.

చట్టసభల్లో రిజర్వేషన్

ప్రధాన మంత్రి మోదీ నాయకత్వంలో సాధించిన ప్రముఖ విజయాల్లో ఒకటి నారీ శక్తి వందన్ అధినియం. మహిళలను అత్యున్నత నిర్ణయాధికార సంస్థల్లోకి తీసుకురావడానికి ఉద్దేశించిన ప్రగతిశీల, పరివర్తనాత్మక చట్టం. పార్లమెంటు, శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల నిబంధనతో ఈ చట్టం లింగ సమానత్వం, మహిళా సాధికారత పట్ల మోదీ ప్రభుత్వ అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

ఆర్థిక భాగస్వామ్యం

జన్ ధన్ యోజన కింద 28 కోట్ల మంది మహిళలు తొలిసారిగా బ్యాంక్ ఖాతాదారులుగా మారారు. ఆర్థిక సమ్మిళితత్వం, సాధికారత దిశగా గణనీయమైన పురోగతిని సాధించారు. ఈ అపూర్వమైన కార్యక్రమం మహిళలకు అధికారిక బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే కాక వివిధ ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలకు తలుపులు తెరిచింది. తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సమూహాలలో ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పెంపొందించింది.

వ్యాపారులుగా అతివలు

మొత్తం 46 కోట్ల లబ్ధిదారుల్లో మహిళల కోసం ప్రత్యేకంగా 31 కోట్ల ‘ముద్రా’ రుణాల మంజూరు మహిళల ఆర్థిక సాధికారతను పెంపొందించే విషయంలో ప్రభుత్వ నిబద్ధతను వెల్లడిస్తుంది. సమ్మిళిత వృద్ధిని, స్థిరమైన అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడంలో  మహిళలు పోషించే కీలక పాత్రను ఈ కార్యక్రమం గుర్తించింది. 

లఖ్‌పతి దీదీలు

ఒక కోటి ‘లఖ్‌పతి దీదీల’ ఆవిర్భావం గ్రామీణ భారతదేశంలో పెనుమార్పును సూచిస్తుంది. ఇది సాధికారత, ఆర్థిక శక్తి సాధించగల పరివర్తనకు బలమైన ప్రేరకంగా పని చేస్తుంది. ఆర్థిక వనరులు, వ్యాపారం చేసే చాకచక్యం కలిగి ఉన్న ఈ మహిళలు వారి చుట్టుపక్కల వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు తెస్తున్నారు. చిన్న పరిశ్రమల స్థాపన, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, అవసరమైన సేవలను అందించడం ద్వారా వారు మౌలికంగా గ్రామీణ జీవనోపాధిని పునర్నిర్మిస్తున్నారు. వారి అచంచలమైన ఆత్మవిశ్వాసంతో పేదరికం నుంచి వారు బయటపడటమే కాకుండా గ్రామాల్లో సౌభాగ్యాన్ని వ్యాపింపజేస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా లఖ్‌పతి దీదీల లక్ష్యాన్ని 3 కోట్లకు సవరించింది.

సమ్మిళిత వృద్ధిని పెంపొందించడానికి, దేశవ్యాప్తంగా అసంఖ్యాకమైన మహిళలకు ఆశావహ భవిష్యత్తును అందించడానికి దాని నిబద్ధతను ఇది నొక్కిచెప్పింది. కొత్త, ప్రస్తుత స్వయం సహాయక బృందాలకు వ్యూహాత్మక మద్దతు ద్వారా గ్రామీణ భారతదేశానికి మరింత సమానమైన, సంపన్నమైన భవిష్యత్తుకు భరోసానిస్తూ లఖ్‌పతి దీదీల పరివర్తన ప్రభావాన్ని మరింత విస్తరించేందుకు ఈ కార్యక్రమం హామీ ఇస్తుంది.

స్వయం సహాయక బృందాలకు రుణాలు

దేశవ్యాప్తంగా 83 లక్షల స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జి) సాధికారీకరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల రుణ మద్దతు ప్యాకేజీని ప్రకటించింది. ఈ కార్యక్రమం అట్టడుగు స్థాయిలో ఆర్థికాభివృద్ధిని పెంపొందించడానికి, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు సాధికారత కల్పించడానికి  ఉపయోగ పడుతుంది

పాఠశాలల్లో పారిశుధ్యం

ప్రభుత్వ పాఠశాలల్లో, ముఖ్యంగా బాలికలకు తగిన పారిశుద్ధ్య సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడడంలో, విద్యను ప్రోత్సహించడంలో, ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. 97.4 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు బాలికలకు మరుగుదొడ్లు ఉన్నాయి. ఈ క్లిష్టమైన సమస్యను పరిష్కరించడంలో గణనీయమైన పురోగతి జరిగింది. ఈ విజయం అనుకూలమైన విద్యా వాతావరణాన్ని పెంపొందించడమే కాకుండా బాలికల ఆత్మగౌరవాన్ని, హక్కులను కూడా పరిరక్షిస్తుంది.

ఇళ్లపై యాజమాన్యం

పిఎం ఆవాస్ యోజనలో 72 శాతం మంది లబ్ధిదారులు మహిళలు. మహిళా సమానత్వాన్ని సాధించడంలో గణనీయమైన పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కేటాయింపు సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో ప్రాథమిక అంశం అయిన గృహ ప్రవేశం ద్వారా మహిళలకు సాధికారత కల్పించాలనే ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. లబ్ధిదారులుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఈ కార్యక్రమం వారి ఇంటి అవసరాన్నీ మాత్రమే కాకుండా వారి ఆర్థిక స్వాతంత్ర్యం, సామాజిక సంక్షేమాన్ని పెంపొందిస్తుంది.

సంపూర్ణ గ్రామీణ పారిశుధ్యం

నూటికి నూరు శాతం గ్రామీణ పారిశుధ్యాన్ని సాధించడం మౌలిక సదుపాయాలకు మాత్రమే కాకుండా మహిళల గౌరవానికి సంబంధించినది. గ్రామీణ ప్రాంతాల్లో సరిపడా మరుగు దొడ్డి సౌకర్యాలు లేకపోవడం వల్ల ఎక్కువగా ఇబ్బందిపడేది ఆడవారే. ఇది వారి ఆరోగ్యానికి, గోప్యతకు, భద్రతకు భంగం కలిగిస్తోంది. సమగ్ర పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మోదీ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మహిళలకు గౌరవప్రదమైన, పరిశుభ్రమైన సౌకర్యాలను అందించడం ద్వారా వారికి సాధికారత కల్పిస్తోంది. ఈ విధానం లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యకరమైన, సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి దోహదం చేస్తుంది.

సుకన్య సమృద్ధి

సుకన్య సమృద్ధి ఖాతాలు ఒక ప్రముఖ పెట్టుబడి మార్గంగా ఆవిర్భవించాయి. 3.2 కోట్ల ఖాతాల్లో మొత్తం రూ.80,000 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. తమ ఆడబిడ్డల ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచేందుకు తల్లిదండ్రులు, సంరక్షకులు ఈ పథకంపై ఉంచిన విశ్వాసానికి ఈ భారీ మొత్తమే నిదర్శనం. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, పన్ను ప్రయోజనాలు, దీర్ఘకాలిక పొదుపు స్వభావం కారణంగా దేశవ్యాప్తంగా అనేక కుటుంబాలు ఈ పథకాన్ని ఎంచుకుంటున్నాయి.

ట్రిపుల్ తలాక్ రద్దు

ట్రిపుల్ తలాక్ రద్దు ముస్లిం సమాజంలో లింగ సమానత్వం, న్యాయం దిశగా గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ‘తలాక్’ అని మూడుసార్లు చెప్పడం ద్వారా భర్తలు తమ భార్యలకు తక్షణమే విడాకులు ఇవ్వడానికి అనుమతించే ఈ సంప్రదాయం తరచుగా మహిళలకు హాని కలిగించే విధంగా, వారికి ఎటువంటి చట్టపరమైన సహాయం లేకుండా చేసింది. ట్రిపుల్ తలాక్‌ను నిషేధించడం ద్వారా, ముస్లిం మహిళల హక్కులు గౌరవాన్ని పరిరక్షించడం బిజెపి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

లింగ నిష్పత్తి పెంచిన బేటీ బచావో బేటీ పఢావో

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమం దేశంలో లింగ సమానత్వం, స్త్రీ సాధికారత ప్రాముఖ్యత గురించి చైతన్యాన్ని గణనీయంగా పెంచింది. మొత్తం లింగ నిష్పత్తిలో మెరుగుదల ఈ కార్యక్రమం గుర్తించదగిన విజయాలలో ఒకటి. 2014లో కాంగ్రెస్ హయాంలో ప్రతి 1,000 మంది పురుషులకు 918 మంది స్త్రీలు ఉంటే 2022-23 సంవత్సరంలో ప్రతి 1,000 మంది పురుషులకు 933 మంది స్త్రీలు ఉన్నారు. ఇది గణనీయమైన వృద్ధి.

ఐఐటీల్లో పెరుగుతున్న మహిళలు

గత కొన్ని సంవత్సరాలుగా, ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటిలు)లో మహిళా విద్యార్థుల సంఖ్యా గణనీయంగా పెరగడం ప్రభుత్వం చేసిన వివిధ ప్రయత్నాలు ఫలించాయనడానికి నిదర్శనం. 2016లో ఐఐటీల్లో మొత్తం విద్యార్థుల సంఖ్యలో మహిళలు కేవలం 8 శాతం మాత్రమే ఉన్నారు. అయితే 2022 నాటికి ఈ సంఖ్య 20 శాతానికి పెరిగింది. ఇది ఉన్నత విద్యా రంగంలో స్త్రీ, పురుష సమానత్వాన్ని పెంపొందించడంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఈ అద్భుతమైన పెరుగుదల ‘స్టెమ్’ విభాగాలలో లింగ వైవిధ్యం, సమానత్వాలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన వివిధ కార్యక్రమాల ప్రభావాన్ని వెల్లడిస్తుంది.

గర్భాశయ క్యాన్సర్ కు టీకాలు

యువతులు, మహిళలు ఆరోగ్యవంతమైన జీవితాలను గడిపేందుకు ప్రభుత్వం గర్భాశయ క్యాన్సర్‌లకు వ్యాక్సిన్‌లను వేసే కార్యక్రమాన్ని చేపట్టింది. టీకా వంటి నివారణాత్మక చర్యలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ప్రభావితం చేసే వ్యాధిని ఎదుర్కోవడానికి చురుకైన చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రయత్నం గర్భాశయ క్యాన్సర్ వినాశకరమైన ప్రభావాల నుండి వ్యక్తులను రక్షించడమే కాకుండా భవిష్యత్ తరాల శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చే ప్రజారోగ్య కార్యక్రమాలలో పెట్టుబడుల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.

కిషోర్ ఉపాధ్యాయ