తెలంగాణ ఎన్నికల ఇన్‌ఛార్జిగా అభయ్ పాటిల్
Posted On March 28, 2024
బిజెపి తెలంగాణ ఎన్నికల ఇన్‌ఛార్జిగా ఎమ్మెల్యే అభయ్ పాటిల్ నియమితులయ్యారు. రానున్న తెలంగాణ లోక్‌సభ ఎన్నికలను పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మొత్తం 13 రాష్ట్రాలకు 18 మంది ఇన్‌ఛార్జిలు, సహ ఇన్‌ఛార్జిలను నియమించారు. ఇందులో తెలంగాణకు కర్ణాటకలోని బెలగాం దక్షిణ ఎమ్మెల్యే అభయ్ పాటిల్‌ను నియమించారు. మార్చ్ 30న అభయ్ పాటిల్ తెలంగాణకు రానున్నారు. తెలంగాణలో 17కు 17 లోక్ సభ స్థానాలు గెలిపించాలన్న లక్ష్యం దిశగా పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు.

