విపత్కర పరిస్థితుల్లోనూ సమర్థుడి నేతృత్వంలో భారత్ సురక్షితం
గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గత 10 రోజులుగా అమెరికా-ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కూడా నాలుగు సంవత్సరాలకు పైగా కొనసాగుతుండడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎంతో ప్రభావం చూపింది. గత సంవత్సర కాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివాదాస్పద, విపరీత నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు, సంక్షోభాలు ఎదురయ్యాయి. దాని ప్రభావం మన దేశంపై కూడా పడింది. అయితే, ధృడ నాయకత్వం తీసుకున్న నిశ్చల నిర్ణయాలతో అమెరికానే వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది.
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ ఎన్నో దేశ విచ్ఛిన్నకర, హిందూ వ్యతిరేక, మతోన్మాద అనుకూల నిర్ణయాలు ఎన్నో తీసుకుంది. ఫలితంగా స్వతంత్ర్యం వచ్చిన తొలినాళ్ల నుంచి పాకిస్థాన్ తో అనవసర యుద్ధాలు, చైనాను మూర్ఖంగా నమ్మడం, దేశ రక్షణ మంత్రిగా కమ్యూనిస్టును పెట్టుకోవడం, సమర్థ సైనిక అధికారులపై నెహ్రూ దుర్మార్గ చర్యల కారణంగా చైనా చేతిలో ఘోర ఓటమితో అంతర్జాతీయంగా అపఖ్యాతి పాలై, ఐక్యరాజ్యసమితిలో ప్రముఖ స్థానాన్ని చేజిక్కించుకోలేని దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడ్డాయి.
2014లో మోదీ నేతృత్వంలో బిజెపి ముఖ్య భాగస్వామ్యంతో ఏర్పడిన ఎన్డీఏ ఫ్రభుత్వం దేశ ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. అద్భుతమైన మౌలిక వసతులు కల్పించడం, బాంబు పేలుళ్లను సంపూర్ణంగా అడ్డుకోవడం, కొత్తగా 50 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిపించడం, 10 కోట్లకు పైగా మరుగుదొడ్లు కట్టి మహిళల గౌరవాన్ని పెంచడం, 4 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లు నిర్మించడం, 80 కోట్ల జనాభాకు 5 సంవత్సరాలుగా ఉచిత ఆహార ధాన్యాలు అందించడం, కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడం, దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేయడం, అయోధ్యలో రామాలయం నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలగించడం, ముస్లిం మహిళల రక్షణ కోసం ట్రిపుల్ తలాఖ్ చట్టాన్ని రద్దు చేయడం, అఖండ భారత్ లోని మూడు ముస్లిం దేశాల్లో ఘోర అకృత్యాలకు గురవుతున్న ముస్లిమేతరులకు సీఏఏ చట్టం ద్వారా శరణు, రక్షణ కల్పించడం, దేశ ఆర్థిక వ్యవస్థను పదో స్థానం నుంచి నాలుగో స్థానానికి తీసుకురావడం, యావత్ ప్రపంచం దృష్టిలో భారత గౌరవాన్ని పెంచడం వంటివెన్నో ఉన్నాయి. విక్రమార్కుడిలా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధిస్తుంటే ఓర్వలేని ప్రతిపక్షాలు రకరకాలుగా ప్రభుత్వాన్ని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తోంది. అసందర్భంగా డజనున్నర కేసులు సుప్రీం కోర్టులో వేసి, న్యాయస్థానం చేత చివాట్లు తిని దేశ ప్రజల దృష్టిలో మరింత పలుచనయ్యాయి.
మోదీ ప్రభుత్వం మహిళల వంటింటి కష్టాలు తొలగిస్తూ పేదలకు 12 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. అంతేకాదు, ఈ 12 ఏళ్లలో ఏనాడూ గ్యాస్ కొరత రాలేదు, ధరలూ అదుపు తప్పలేదు. అమెరికా-ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం వల్ల చమురు దిగుమతులకు ఆటంకాలు ఏర్పడడంతో, గృహ అవసరాలకు ఇబ్బంది రాకూడదని, వాణిజ్య సంస్థలకు గ్యాస్ సరఫరాలో కొంత నియంత్రణ విధించడాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా మలచుకొని రచ్చ రచ్చ చేయాలని చూడడం పచ్చి అవకాశవాదానికి నిదర్శనం. అయితే, పరిస్థితులను అర్థం చేసుకున్న దేశ ప్రజలు మాత్రం వారికి మద్దతు తెలపడం లేదు.
ప్రపంచం మొత్తం యుద్ధ వాతావరణంలో తల్లడిల్లిపోతుంటే మనం టీ20 వరల్డ్ కప్ విజయాలను ఆస్వాదిస్తూ, హోలీ ఉత్సవాలు జరుపుకొంటూ ఉంటే ఓర్వలేని ప్రతిపక్షాలు మరిన్ని దుర్మార్గ కుట్రలకు తెరతీస్తున్నాయి. పహల్గాం దాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్తాన్ కు, ఆ దేశంలోని ఉగ్రవాదులకు గట్టి బుద్ధి చబితే, ప్రతిపక్షాలు యుద్ధం అనసవరమని రచ్చ చేశాయి. ఇది యుద్ధాల కాలం కాదని ప్రపంచానికి చెప్తూ వచ్చిన మోదీ పాకిస్తాన్ ఉగ్రవాదానికి షాక్ ట్రీట్మెంట్లా ఆపరేషన్ సిందూర్ తో బుద్ధి చెప్పి, మన శత్రు దేశాల ఆయుధాల లోపాలను, మన దేశాల ఆయుధ సంపత్తి ఘనతను చాటిచెప్పి, మన ఆయుధాలకు ప్రపంచంలో మార్కెట్ కల్పించారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం, యుద్ధం చేస్తే వద్దంటూ, ఆపితే ఆపొద్దంటూ, అడుగడుగునా ప్రభుత్వాన్ని అడ్డుకునే కుట్రలు చేస్తున్నాయి.
ప్రపంచాన్ని కరోనా అతలాకుతలం చేసిన వేళ అంకితభావం గల నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆ మహమ్మారిని సమర్థంగా అడ్డుకుంది. ప్రస్తుత యుద్ధాల కాలంలోనూ దాని తాలూకూ దుష్ప్రభావం దేశంపై పడకుండా మోదీ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నారు. విపత్కర పరిస్థితుల్లో నరేంద్ర మోదీ లాంటి అత్యంత సమర్థుడైన, అంకితభావం గల ప్రధానమంత్రి ఉండడం మన అదృష్టం అని దేశ ప్రజలు భావిస్తున్నారు.

