Vijaya Sankalpa Yatra Day-2

దిగ్విజయంగా బిజెపి విజయ సంకల్ప యాత్ర

తెలంగాణలో ఫిబ్రవరి 21న రెండో రోజు బిజెపి విజయ సంకల్ప యాత్ర దిగ్విజయంగా కొనసాగింది. 4 క్లస్టర్ల వారీగా కొనసాగిన బిజెపి యాత్రల్లో అడుగడుగునా జనం నీరాజనం పలికారు. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ ప్రజల నినాదాలతో రహదారులు, పురవీధులన్నీ పోటెత్తాయి. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలు, సభల్లో బిజెపి ముఖ్య నాయకులు పదేండ్ల నరేంద్ర మోదీ పాలనలో చేసిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు తెలంగాణలో చేసిన అభివృద్ధిని వివరించి ప్రజల మద్దతు కూడగట్టారు. గత కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతిని, కుటుంబ రాజకీయాలను ప్రజలకు తెలియజేశారు. రాష్ట్రంలో అవినీతి పాలనతో వంచించిన బీఆర్ఎస్, అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చి మోసపూరిత చర్యలతో పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. బిజెపితోనే తెలంగాణ ప్రగతి సాధ్యమని, అందుకే, మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానిగా గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు.

Vivjaya Sankalpa Yatra krishnamma cluster

కృష్ణమ్మ క్లస్టర్ : నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా గ్రామంలొ ప్రారంభమైన యాత్ర రెండవ రోజు కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నారాయణపేట, మహబూబ్ నగర్, దేవరకద్ర నియోజకవర్గాల మీదుగా కొనసాగింది. ఈ యాత్రలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ, ఎమ్మెల్యే రాజా సింగ్, జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధన్వాడలో రోడ్​ షో నిర్వహించిన రోడ్ షోకు అపూర్వ రీతిలో జనం తరలివచ్చి, బిజెపికి మద్దతు పలికారు. నారాయణపేట, మహబూబ్‌నగర్‌లో రోడ్‌ షోల్లో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తకోటలో నేత కార్మికులతో, కురుమ సంఘం నేతలతో కిషన్ రెడ్డి  ముచ్చటించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. అదేవిధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం నేత కార్మికులకు అండగా ఉండటంతో పాటు సమస్యలు పరిష్కరించి ఆదుకుంటామని భరోసా కల్పించారు.

Vijaya Sankalpa Yatra Komuram Bheem

కొమురం భీం క్లస్టర్ : ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైన విజయ సంకల్ప యాత్రలో రెండవ రోజు జనం నీరాజనం పలికారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్ర నిర్మల్, బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గాల మీదుగా సాగింది. ఈ యాత్రలో ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్, రామారావు పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ దారి పొడవునా కాషాయ శ్రేణులు నూతనోత్తేజంతో యాత్రలో పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలను, నేడు కాంగ్రెస్ సర్కారు అవలంబిస్తున్న మోసపూరిత వైఖరిని ప్రజల మధ్య ఎండగట్టారు. మధ్యాహ్నం నిర్మల్ జిల్లాకు విచ్చేసిన బండి సంజయ్ కుమార్  స్థానిక ఎంపీ సోయం బాపూరావు , ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి , రామారావు పటేల్ తో కలిసి నిర్మల్ లోని వెయ్యి ఊడల మర్రిని సందర్శించారు. రాంజీగోండు స్మారక కేంద్రం వద్ద ఒక వర్గానికి చెందిన వ్యక్తి సమాధి ఉండటంతో స్థానికులంతా బండి సంజయ్ కుమార్ ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డితో కలిసి అక్కడికి వెళ్లి రాంజీగోండు స్మృతి కేంద్రం ఏర్పాటుకు భూమిపూజ చేశారు.

Vijaya Sankalpa Yatra Raja Rajeshwara

రాజరాజేశ్వరి క్లస్టర్: వికారాబాద్ జిల్లా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలోని తాండూరులో ప్రారంభమైన యాత్రలో రెండవరోజు ఎంపీ డా.కె. లక్ష్మణ్ ఆధ్వర్యంలో వికారాబాద్, నర్కల్, పరిగి, పూడురు, మన్నెగూడ, ఆలూరు మండలాల మీదుగా ఈ యాత్ర కొనసాగి చేవెళ్లకు చేరుకుంది. ఈ సందర్భంగా పదేళ్ల నరేంద్ర మోదీ పాలనలో తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలతో పాటు ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ యాత్రలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, బిజెపి మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ పి. మురళీధర్ రావుతో పాటు కాలే యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Viaya Sankalpa Yatra Bhagyalaxmi

భాగ్యనగర్ క్లస్టర్: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి ఆశీస్సులతో ప్రారంభమైన యాత్రలో రెండవ రోజు మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో యాదాద్రి, ఆలేరు, తుంగతుర్తి మీదుగా ఈ యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రా రెడ్డితో పాటు కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.