VSY Day-3

లక్ష్యం దిశగా విజయ సంకల్ప యాత్ర

భారతీయ జనతా పార్టీకి ఒకటే లక్ష్యం.. తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడం.. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి విజయంలో తెలంగాణ ప్రజలను భాగస్వాములు చేయడం.. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు, ఈ ధ్యేయాన్ని నెరవేర్చుకునేందుకు  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రారంభించిన విజయ సంకల్ప యాత్ర మూడో రోజు దిగ్విజయంగా సాగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై సూటి ప్రశ్నలు సంధిస్తూ… గత బీఆర్ఎస్ పాలకుల అవినీతిని ఎండగడుతూ కొనసాగిన నేతల మాటలు ప్రజలను జాగృతం చేస్తున్నాయి.

GKR KomuramBheem

కొమురం భీం క్లస్టర్ : ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో కొనసాగుతున్న విజయ సంకల్ప యాత్రకు జనం నీరాజనం పట్టారు. అడుగడుగునా అపూర్వ స్పందన లభించింది. యాత్ర పొడవునా మహిళలు హారతులు పట్టి.. పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగిన ఈ యాత్ర ఆదిలాబాద్, ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ కొనసాగింది. ఈ యాత్రలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా… బిజెపి రథసారధి కిషన్ రెడ్డి కాగజ్ నగర్ లో పేపర్ మిల్ కార్మికులతో సమావేశమయ్యారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను, అద్భుత విజయాలను, సమర్థవంతమైన పాలనా తీరును వివరించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోదీకి, భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు. అనంతరం, సిర్పూర్ కాగజ్ నగర్ లోని ఈజ్ గావ్ గ్రామంలో వేద మందిర్ సమాజంతో సమావేశయ్యారు. యాత్ర సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలు, అవినీతిని ఎక్కడికక్కడ ఎండగట్టారు.

రాజరాజేశ్వరి క్లస్టర్: చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి చేరుకున్న విజయ సంకల్ప యాత్ర జనసంద్రంగా మారింది. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపారు. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ నినదించారు. చేవెళ్ల, రాజేంద్రనగర్, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ కొనసాగిన ఈ యాత్రలో బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ , బిజెపి శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి , మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు.

భాగ్యనగర్ క్లస్టర్: భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి చేరుకున్న విజయ సంకల్ప యాత్ర సమరోత్సాహంతో కొనసాగింది. దేశం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మరింత బలపర్చేలా, భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపేందుకు జనం ప్రభంజనంలా కదిలొచ్చారు. తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా కొనసాగిన ఈ యాత్రలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. 

కృష్ణమ్మ క్లస్టర్ : మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కొనసాగుతున్న విజయ సంకల్ప యాత్రలో దారి పొడవునా ప్రజలు భారీగా తరలివచ్చి మమేకం అయ్యారు. భారతీయ జనతా పార్టీకి అపూర్వ మద్దతు తెలిపి, ఆశీర్వాదం తెలిపారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ  ఆధ్వర్యంలో కొనసాగిన ఈ యాత్ర మహబూబ్ నగర్, కొడంగల్, షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టివచ్చింది. ఈ యాత్రలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.