PM Modi in Kerala

కేరళలో మూడో ప్రత్యామ్నాయంగా ఎన్డీయే

BJP flagకేరళలో 2024 లోక్‌సభ ఎన్నికలు మునుపటి ఎన్నికల కంటే భిన్నంగా ఉండబోతున్నాయి. ప్రధాన ప్రత్యర్థులు అలాగే ఉన్నప్పటికీ ఎన్డీయే మూడవ ఫ్రంట్‌గా అవతరించే అవకాశం ప్రబలంగా ఉంది. రాష్ట్రంలోని లోక్‌సభలో గతంకంటే అధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు ఎన్డీయే ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ, సిపిఎం మధ్య 2019 నాటికీ, ఇప్పటికీ సమీకరణాలు మారాయి.  2019 లో ఈ రెండు పార్టీలు రాజకీయ ప్రత్యర్థులు కాగా ఇప్పుడు ఇప్పుడు వారి మధ్య సంబంధాలు గందరగోళంగా ఉన్నాయి.

 కేరళలో ఈ రెండు పార్టీలు చెరో కూటమికి నేతృత్వం వహిస్తున్నాయి. లెఫ్ట్ వామపక్ష ప్రజాస్వామ్య సంఘటన (ఎల్ డి ఎఫ్),  ఐక్య ప్రజాస్వామ్య సంఘటన (యూడీఎఫ్) కేరళలో ప్రధాన ప్రత్యర్థులు కాగా కేరళ బయట మాత్రం ఈ రెండు పార్టీలు కొన్ని రాష్ట్రాల్లో మిత్రపక్షాలు. 

 ఈ పార్టీలు త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లో మిత్రపక్షాలు. ఈ రెండు రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు లేదా సీపీఎంకు ప్రజల్లో బలం ఉండేది. అయితే పశ్చిమ బెంగాల్‌లో ఈ రెండు పార్టీలు కూడా ఒకదానికొకటి దూరమవుతున్నాయని ఇటీవలి మీడియా వార్తలు వెల్లడిస్తున్నాయి. కానీ ఇప్పుడు కమ్యూనిస్టులు లేదా సిపిఎం ఇప్పుడు ఒక్క కేరళకు మాత్రమే పరిమితమయ్యారు.  త్రిపురలో సిపిఎం,  కమ్యూనిస్టులు తమ ప్రజాపునాదిని కోల్పోయారు.

 బిజెపికి కేరళ ఒక ప్రయోగాత్మక రాష్ట్రం. 2016లో కేరళలో ఒక్క అసెంబ్లీ సీటును మాత్రమే గెలుచుకున్న బీజేపీ ఇప్పటి వరకు కేరళలో లోక్‌సభ ఎన్నికల్లో  ఖాతా తెరవలేకపోయింది. అయితే ఈసారి మూడు లేదా నాలుగు సీట్లతో బీజేపీ విజయం సాధించే అవకాశం ఉంది. తిరువనంతపురం లోక్‌సభ స్థానాన్ని బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. మూడుసార్లుగా తిరువనంతపురం ఎంపీగా ఎన్నికవుతూ వస్తున్నా శశిథరూర్‌ను కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఓడించడం ఖాయం. పార్టీ అధ్యక్ష పదవికి గాంధీ కుటుంబానికి విధేయుడైన అభ్యర్థి మల్లికార్జున్ ఖర్గేపై శశి థరూర్ పోటీ చేయడమే ఆయన చేసిన పాపం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం శశి థరూర్ గెలవకుండా చేయాలని ప్రయత్నిస్తోంది.  ఎందుకంటే భవిష్యత్తులో అతను గాంధీ కుటుంబానికి సవాలుగా మారతాడని వారు భావిస్తున్నారు. 

 వ్యూహాత్మకంగా  బిజెపి అనుకూల ఓటింగ్ ద్వారానైనా సరే శశి థరూర్‌ను ఓడించేందుకు ఈ వర్గం శాయశక్తులా ప్రయత్నిస్తుంది. దీంతో తిరువనంతపురం లోక్‌సభ స్థానం బీజేపీకి దక్కడం ఖాయం.

 కేరళలో బీజేపీ చాలా స్థానాల్లో ఓట్ల శాతాన్ని పెంచుకుంది. ఐదు లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి 2 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. తిరువనంతపురం, పతనంతిట్ట, అట్టింగల్, పాలక్కాడ్, త్రిసూర్ లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి రెండు  లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. తిరువనంతపురం లోక్‌సభ స్థానంలో బీజేపీకి మూడు లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. వీటితో పాటు పలు స్థానాల్లో బీజేపీకి గౌరవప్రదమైన ఓట్లు వచ్చాయి. కనుక 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీ ఖాతా తెరవడమేకాక గౌరవప్రదమైన ఓట్లు, సీట్లు సంపాదిస్తుందని 2019లోనే స్పష్టమైపోయిది. 

 కేరళలో 2019 లోక్‌సభ ఎన్నికలలో, రాహుల్ గాంధీ యుపిలోని తన సంప్రదాయ సాంప్రదాయ స్థానమైన అమేథీతో పాటుగా ముస్లింలు అధికంగా ఉండే వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కూడా పోటీ చేశారు. రాహుల్ గాంధీ వాయనాడ్ లోక్‌సభ స్థానంలో గెలిచినప్పటికీ అమేథీలో ఓడిపోయారు. గాంధీ కుటుంబంలో ఎవరైనా కేరళ నుంచి పోటీ చేయడం ఇదే తొలిసారి. ఆయన కేరళలో అడుగుపెట్టిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తన పునాదిని కోల్పోయింది.

 యుడిఎఫ్‌, ఎల్‌డిఎఫ్‌ల ఓటు బ్యాంకును కూడా చీల్చడానికి బిజెపికి సువర్ణావకాశం ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల నుంచి కేరళలో కాంగ్రెస్ పార్టీ నిలకడగా తన ప్రాబల్యాన్ని కోల్పోతోంది. 

 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికలలో ఎల్‌డిఎఫ్ దాని ప్రధాన ప్రత్యర్థి యుడిఎఫ్‌ని నిర్ణయాత్మకంగా ఓడించి తిరిగి అధికారంలోకి వచ్చింది. 1982 తర్వాత ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న యూడీఎఫ్ కేరళలో తిరిగి అధికారంలోకి రాలేకపోవడం ఇదే తొలిసారి. కేరళలో ఐదేళ్ల పదవీకాలం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యుడిఎఫ్,  సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ మధ్య అధికార మార్పిడి జరిగే సంప్రదాయం ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనే కాకుండా 2020 కేరళ స్థానిక ఎన్నికల్లో కూడా యూడీఎఫ్ పనితీరు అత్యంత అధ్వాన్నంగా ఉంది. గ్రామ పంచాయితీ, బ్లాక్ పంచాయితీ, జిల్లా పంచాయితీ,  కార్పొరేషన్లలో కూడా యూడీఎఫ్ సీట్ల వాటా తగ్గింది. గ్రామ పంచాయతీలో, యూడీఎఫ్ సీట్ల వాటా 44, బ్లాక్ పంచాయతీలో 23, జిల్లా పంచాయతీలో 4,   కార్పొరేషన్లలో 1 తగ్గింది. ఎల్డీఎఫ్ కూడా 2015 తో పోలిస్తే 2020లో గ్రామ పంచాయతీలలో 35 సీట్లను కోల్పోయింది.  కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఎన్డీయే పనితీరు మెరుగుపరుచుకుని ప్రశంసలు అందుకుంది. ఎన్డీయేకు ఇది పెద్ద శుభవార్త.

 ఇప్పుడు  2021 అసెంబ్లీ ఎన్నికలలో జరిగిన మథనం కారణంగా యూడీఎఫ్ శిబిరం నుండి కొంత మంది ఓటర్లు ప్రత్యర్థి శిబిరానికి లేదా తృతీయ ప్రత్యామ్నాయంగా మారుతున్నా ఎన్డీయేకి మారవచ్చు. నేడు కేరళలో తన ప్రజాబలాన్ని విస్తరించుకోవడానికి ఎన్డీయేకి ఇది సువర్ణావకాశం.

 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై చేసిన కృషి ద్వారా ఈ సారి ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనబరచాలని బీజేపీ భావిస్తోంది. కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రైల్వేలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై చాలా కృషి చేసింది. 530 కిలోమీటర్ల తిరువనంతపురం-కాసరగోడ్ సిల్వర్‌లైన్ రహదారి ప్రాజెక్ట్ ప్రతిపాదన  కేరళ మౌలిక సదుపాయాల చరిత్రలో మైలురాయి. ఇది పూర్తయితే గంటకు 135 కిమీ  వేగంతో ప్రయాణించవచ్చు.  ఇది కేరళ ఉత్తరం నుంచి దక్షిణం వరకు వ్యాపించి ఉంటుంది. ఈ ప్రాజెక్టు  రాష్ట్ర సామాజిక-ఆర్థిక స్థితిగతులను మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 

 ఇవి కాకుండా అనేక ఇతర ప్రాజెక్టులు ప్రతిపాదన దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు   2024 లోక్‌సభ ఎన్నికలలో బిజెపి అంచనాలను నిజంచేసే అవకాశం ఎంతైనా ఉంది.