ముస్లిం లీగ్, ఎంఐఎంగా కాంగ్రెస్ మారుతుందా?
1885లో అప్పటి గవర్నర్ జనరల్ ఢఫరిన్ సలహాతో బ్రిటిష్ వారి కోసం రిటైర్డ్ బ్రిటిష్ సివిల్ సర్వెంట్ ఏ.ఓ. హ్యూం స్థాపించిన కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాలం పాటు వారికే ఊడిగం చేస్తూ వచ్చింది. నిష్కళంక దేశ భక్తుడు బాల గంగాధర్ తిలక్ ప్రవేశంతో స్వాతంత్ర్యం కోసం ఏర్పడిన ప్రజా ఉద్యమంగా కాంగ్రెస్ రూపాంతరం చెందడం మొదలైంది. కానీ కాంగ్రెస్ ఎన్నడూ బాల గంగాధర్ తిలక్‌ను పార్టీ అధ్యక్షుడిని కానివ్వలేదు. తిలక్‌తో పాటు పటేల్, సుభాష్ చంద్రబోస్ లాంటి మహనీయులు కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య ఉద్యమాలు నడిపించినప్పటికీ రెండోసారి అధ్యక్షుడైన సుభాష్ చంద్రబోస్‌ను బలవంతంగా రాజీనామా చేయించడంతో కాంగ్రెస్ బ్రిటిష్ అనుకూలత బయటపడింది.
1947లో స్వాతంత్ర్యం వచ్చే సమయానికి దేశం ముక్కలవడానికి ముస్లిం లీగ్‌కు సహకరించింది కాంగ్రెస్ పార్టీనే. అనుకోకుండా తొలి ప్రధాని అయిన నెహ్రూ తొలినాళ్ల నుంచే ముస్లిం అనుకూల, హిందూ వ్యతిరేక విధానాలను అవలంబించారు. నెహ్రూ-లియాఖత్ ఒప్పందం, మైనార్టీ కమిషన్, ముస్లిం పర్సనల్ లా బోర్డ్, వక్ఫ్ బోర్డు, హిందూ కోడ్ బిల్ వంటి హిందూ వ్యతిరేక ముస్లిం అనుకూల నిర్ణయాలతో కాంగ్రెస్ తన ముస్లిం లీగ్ లక్షణాలను కొంత కొంత బయటపెట్టింది. 1969లో కాంగ్రెస్ చీలికతో ఇందిరా గాంధీ ముస్లిం లీగ్ మద్దతును బాహాటంగా తీసుకుంది. రాజీవ్ గాంధీ షాబానో కేసులో సుప్రీం కోర్టు తీర్పును కాలరాసి ముస్లిం మతోన్మాద శక్తులకు బాసటగా నిలిచారు. ప్రార్థనా స్థలాల చట్టం, వక్ఫ్ బోర్డు చట్టానికి ముస్లిం అనుకూల సవరణలు కాంగ్రెస్ మరింత ముస్లిం లీగ్ పార్టీగా తన లక్షణాలను చూపించుకుంటూ వచ్చింది. 2011లో ఏకంగా మత కలహాల బిల్లును నూటికి నూరు శాతం హిందువులకు వ్యతిరేకంగా ఎన్నో అంశాలు చేర్చింది. అయితే బిజెపి దీనిని తీవ్రస్థాయిలో వ్యతిరేకించడంతో అది పార్లమెంటులో పాస్ కాలేదు. ఫలితంగా హిందువులకు పెను ప్రమాదం తప్పింది.
గత దశాబ్ద కాలంగా కుచించుకుపోతున్న కాంగ్రెస్ తన హిందూ వ్యతిరేక ముస్లిం అనుకూల విధానాన్ని బాహాటంగా చూపించడం మొదలెట్టింది. జమ్మూ కాశ్మీర్‌లో మతోన్మాద దేశ వ్యతిరేక శక్తులతో కలిసి నమాజ్ చేసిన రాహుల్ వీడియో, ఉగ్రవాది అఫ్జల్ గురుకు చెందిన తుక్డే తుక్డే గ్యాంగ్ తో జేఎన్‌యూలో నిలవడం, 2019లో అమేథీ నుంచి ముస్లిం బాహుళ్య వాయనాడ్ నియోజకవర్గానికి రాహుల్ గాంధీ పారిపోవడంతో కాంగ్రెస్ దాదాపు ముస్లిం లీగ్‌లా అవతరిస్తోందని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇందిరా గాంధీ తర్వాత కాంగ్రెస్ ‘జై హింద్’ నినాదాన్ని వదిలిపెట్టడం కూడా తన ముస్లిం లీగ్ లక్షణాన్ని మరోవిధంగా చూపించింది.
గత లోక్ సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో బాహాటంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా, ముస్లిం మతోన్మాదులకు అనుకూలంగా యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురామని, ప్రత్యేక పౌర చట్టాలను మరింత ముందుకు తీసుకుపోతామని, హిందువుల్లో మాత్రమే కులగణన చేస్తామని స్పష్టంగా చెప్పింది. ఇంకా సంపద పంపకం పేరుతో హిందువులను దోచి ముస్లింలకు పెడుతామని పరోక్షంగా తెలిపింది. పార్లమెంటులో కూడా రాహుల్ గాంధీ హిందువులంటే నఫ్రత్, నఫ్రత్, నఫ్రత్…. హింస, హింస, హింస… అన్న ద్వేషపూరిత మాటలు.. హిందువుల ఆరాధ్య దైవం శక్తిని బాహాటంగా వ్యతిరేకించడం ముస్లిం లీగ్‌గా కాంగ్రెస్ మార్పు దాదాపు పూర్తికావొచ్చిందని అర్థమవుతోంది.
గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజెపి, ఎంఐఎం ఒక్కటే అని తీవ్ర ఆరోపణలు చేసిన అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల్లో మెజారిటీ సాధించగానే సీనియర్లను కాదని, అక్బరుద్దీన్ ఓవైసీనే ప్రోటెం స్పీకర్‌గా ప్రకటించి కాంగ్రెస్‌లోని సుంతుష్టీకరణ విధానాలను బయటపెట్టారు. అక్బరుద్దీన్ ఓవైసీని తన సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి గెలిపించి, ఉప ముఖ్యమంత్రిని చేసి తన పక్కన కూర్చోబెట్టుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బాహాటంగా ప్రకటించి రజాకార్ల పార్టీకి దాసోహం అనడం ముస్లిం లీగ్‌గా కాంగ్రెస్ మారుతుందనడానికి మరో నిదర్శనం.
వంద సంవత్సరాల క్రితం స్థాపించిన ఆర్ఎస్ఎస్, దశాబ్దాల క్రితం ఏర్పడిన పరివార క్షేత్రాల అవిరళ కృషితో, రామ జన్మభూమి ఉద్యమంతో, మూడు దశాబ్దాల క్రితమే హిందూ చేతన దేశవ్యాప్తంగా విస్తరించడం మొదలైంది. ఫలితంగా 1991 నుంచి ఇప్పటి వరకు గత 9 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి ఎన్నడూ మూడంకెల సంఖ్య కిందికి దిగలేదు. ముస్లిం లీగ్‌గా మారుతున్న కాంగ్రెస్ మాత్రం గత 3 లోక్ సభ ఎన్నికల్లో ఎన్నడూ మూడంకెల సంఖ్య చేరుకోలేదు. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ఆ పార్టీ మనుగడకు ముస్లిం ఓట్ల తప్ప మరో గత్యంతరం లేదన్నట్టు మారింది. గత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల సమరానికి నాయకత్వం వహించిన ప్రియాంక గాంధీ ఘోర పరాభవం చవిచూడడంతో రాహుల్ గాంధీచే రాయబరేలిగా బదులుగా వాయనాడ్‌కు రాజీనామా చేయించి, అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయడం ముస్లిం లీగ్‌గా కాంగ్రెస్ మారిందన్న నమ్మకం దేశ ప్రజల్లో బలపడింది.