Jishnu Dev Verma

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

Jishnu Dev Vermaతెలంగాణకు కొత్త గవర్నర్ నియమితులయ్యారు. జిష్ణు దేవ్ వర్మను తెలంగాణ గవర్నర్ గా నియమించారు. జార్ఖండ్ గవర్నర్ గా ఉంటూ ప్రస్తుతం తెలంగాణ ఇంచార్జ్ గవర్నర్ గానూ ఉన్న సి.పి. రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ గా వెళ్లనున్నారు. భారత రాష్ట్రపతి పలు రాష్ట్రాలకు గవర్నర్ లను నియమించారు. హరిభావూ కిషన్ రావు బాగ్ డే ను రాజస్థాన్ గవర్నర్ గా, ఓం ప్రకాశ్ మాథుర్ ను సిక్కిమ్ గవర్నర్ గా, సంతోష్ కుమార్ గంగ్ వార్ ను జార్ఖండ్ గవర్నర్ గా, రామెన్ డేకాను ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా, సి.హెచ్. విజయశంకర్ ను మేఘాలయ గవర్నర్ గా, అసోమ్ గవర్నర్ గా ఉన్న గులాబ్ చంద్ కటారియాను పంజాబ్ గవర్నర్ గా, చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతం పరిపాలకునిగా నియమించారు. సిక్కిమ్ గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అసోమ్ గవర్నర్ గా నియమించారు. దీంతో పాటు ఆయనకు మణిపుర్ గవర్నర్ గా అదనపు బాధ్యతను కూడా అప్పజెప్పారు. పంజాబ్ గవర్నర్, కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ పరిపాలకుడు భన్వావారీలాల్ పురోహిత్ రాజీనామాను భారతదేశ రాష్ట్రపతి ఆమోదించారు.