BSK Cycles

మోదీ కానుకగా 20 వేల సైకిళ్ల పంపిణీ

bsk cyclesకేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ వేదికగా మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్థినీ, విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను అందిస్తున్నారు. మొత్తం 20 వేల సైకిళ్లను పంపిణీ చేయాలని బండి సంజయ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. సీఎస్సార్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ) ఫండ్స్ చెల్లించి ఈ సైకిళ్లను కొనుగోలు చేశారు. ఒక ప్రజాప్రతినిధి తన నియోజకవర్గ పరిధిలో 20 వేల సైకిళ్లను పంపిణీ చేయడం ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదు. ఆ ఘనత బండి సంజయ్ కే దక్కింది. ప్రతి విద్యార్ధికి ఈ సైకిల్ అందించాలనే ఉద్దేశంతో సైకిళ్ల పంపిణీ బాధ్యతను జిల్లా కలెక్టర్ కు అప్పగించారు. కలెక్టర్ ద్వారా డీఈఓ, ఎంఈవో స్కూళ్ల వారీగా ఎంత మంది విద్యార్థులున్నారనే జాబతాను సిద్ధం చేసిన అధికారులు ఆ మేరకు సైకిళ్లను ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా పంపీణీ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ చదువుకునే ప్రతి విద్యార్థికి ఈ సైకిల్ అందజేయాలని కలెక్టర్ ను కోరారు. 

బండి సంజయ్ గత కొన్నేళ్లుగా తన పుట్టిన రోజు సందర్భంగా పేదలకు సేవ చేసే కార్యక్రమాలు చేపడుతున్నారు. వైద్య, విద్య అందని ద్రాక్షలా మారడంతో ఆయా రంగాల్లో పేదలను ఆదుకునే విధంగా వైవిధ్యమైన సేవా కార్యక్రమాలను చేపడుతుండటం విశేషం. ఇటీవల దాదాపు రూ.5 కోట్ల రూపాయల సీఎస్సార్ ఫండ్స్ సేకరించి వేములవాడ, హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట ఏరియా ఆసుపత్రులకు అవసరమైన ఆధునాతనమైన మెడికల్ ఎక్విప్ మెంట్స్ అందించారు. గతంలోనూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోని ఆసుపత్రుల్లోనూ రోగులకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో తన సొంత ఖర్చుతో 2 కోట్ల విలువైన మెడికల్ ఎక్విప్ మెంట్ అందించారు. అంతకుముందు ‘సంజయ్ సురక్షా’ పేరుతో అంబులెన్స్ లను అందించారు. ఇవిగాకుండా మెడిసిన్స్, ఫ్రీజర్స్ సహా ఆసుపత్రులకు అవసరమైన మెడికల్ ఎక్విప్ మెంట్ ను సైతం అందించారు.