సందడిగా టిఫిన్ బైఠక్స్
Posted On April 12, 2024
బిజెపి ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఏప్రిల్ 6న దేశవ్యాప్తంగా పోలింగ్ బూత్ లలో టిఫిన్ బైఠక్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి కార్యకర్త తమ ఇంటి నుంచి టిఫిన్ బాక్స్ తీసుకొనిరావడం ఈ బైఠక్ ప్రత్యేకత. ఇందులో భాగంగా తెలంగాణలోనూ బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ బైఠక్స్ లో పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి కాచిగూడ, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ కోయిలకొండ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోని పోలింగ్ బూత్ లలో టిఫిన్ బైఠక్స్ లో పాల్గొన్నారు. ప్రతి పోలింగ్ బూత్ లో బిజెపి 50 శాతం పైగా ఓట్లు సాధించేందుకు కృషి చేస్తామంటూ పార్టీ కార్యకర్తలు సంకల్పం తీసుకున్నారు.

