ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటిన బిజెపి
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగురవేసింది. మున్సిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించి అటు పట్టణ ప్రాంతాల్లోను, ఇటు గ్రామాల్లోనూ తన పట్టు నిలుపుకొంది. ఎలమంచిలి, గిద్దలూరు, ఎర్రగుంట్ల మున్సిపల్ చైర్మన్ పదవులు బిజెపి గెలుచుకుంది. ఎలమంచిలి మున్సిపల్ ఛైర్మన్ పిళ్లాగా విజయకుమారి, గిద్దలూరు మున్పిపల్ ఛైర్మన్గా డాక్టర్ జాడీ వెంకట నారాయణ, గూడూరు నగర పంచాయతీలో ఛైర్మన్గా దమాం సునీతబాయి గెలుపొందారు. వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో వైకాపా బరిలో నిలపకపోవడంతో గోర్ల మధులత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో నగర పంచాయతీ నెల్లిమర్ల చైర్మన్ పదవులకు జరిగిన ఎన్నికల్లో తెదేపా రెబల్ అభ్యర్ధి పోటీ చేయడంతో బిజెపి అభ్యర్థి ఓడిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 నగర పాలక సంస్థల్లో మేయర్, 3 మున్సిపాలిటీ ఛైర్మన్, రెండు నగర పంచాయతీ ఛైర్ పర్సన్, 67 కార్పొరేటర్ స్థానాలు, 166 కౌన్సిలర్ సీట్లు, 13 నగర పంచాయతీ కౌన్సిలర్ స్థానాలకు బిజెపి పోటీ పడింది. ఇందులో బిజెపి 40 మంది కార్పొరేటర్లు, 107 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, ఏడుగురు నగర పంచాయతీ కౌన్సిలర్లు చొప్పున మొత్తం 158 మంది గెలుపొందారు.
విశాఖపట్నం జిల్లాలో 7, విజయవాడలో 4, విజయనగరంలో 3, గుంటూరులో 3, ప్రకాశంలో 1, నెల్లూరులో 5, తిరుపతిలో 3, చిత్తూరులో 1, కడపలో 4, అనంతపురంలో 1, కర్నూలులో 3, అనకాపల్లిలో 1, ఏలూరులో 3, కృష్ణలో 1 చొప్పున మొత్తం 40 కార్పొరేటర్ స్థానాలు బిజెపి ఖాతాలో పడ్డాయి. పార్వతీపురంలో 2, శ్రీకాకుళంలో 1, విజయనగరంలో 1, అనకాపల్లిలో 2, కాకినాడలో 4, కోనసీమలో 4, తూర్పుగోదావరిలో 3, పశ్చిమగోదావరిలో 1, ఏలూరులో 1, ఎన్టిఆర్ జిల్లాలో 3, గుంటూరులో 1, పల్నాడులో 8, బాపట్లలో 2, ప్రకాశంలో 1, గిద్దలూరులో 4, నెల్లూరులో 3, తిరుపతిలో 8, అన్నమయ్య జిల్లాలో 9, కడప జిల్లాలో 25, సత్యసాయి జిల్లాలో 11, అనంతపురంలో 7, కర్నూలులో 4, నంద్యాల జిల్లాలో 2 స్థానాలు కలిపి మొత్తం 107 మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలను బిజెపి అభ్యర్థులు గెలుచుకున్నారు. పార్వతీపురంలో 1, పశ్చిమగోదావరిలో 2, ఎన్టిఆర్ జిల్లాలో 1, కడప జిల్లాలో 1, సత్యసాయి జిల్లాలో 1, కర్నూలులో 1 కలిపి నగర పంచాయతీల్లో మొత్తం 7 వార్డులను బిజెపి సొంతం చేసుకుంది. పరిషత్ ఎన్నికల విషయానికి వస్తే బిజెపి 30 జిల్లా పరిషత్ స్థానాల్లో పోటీ చేసి 23 స్థానాలు గెలిచింది. ఎంపీటీసీల్లో బిజెపి మొత్తం 170 స్థానాలు గెలుచుకోగా అందులో 53 ఏకగ్రీవం అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించింది. మొత్తం 13 మేయర్ పదవుల్లో టీడీపీ 10, జనసేన 2 కైవసం చేసుకోగా, వైసీపీకి ఒక్క మేయర్ పదవితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 87 మున్సిపాలిటీల్లో 59 చైర్పర్సన్ పదవులను టీడీపీ, 18 జనసేన, 4 బిజెపి దక్కించుకున్నాయి. మరోవైపు వైసీపీకి కేవలం 3 చైర్పర్సన్ పదవులే దక్కాయి. మొత్తంగా మేయర్లు, చైర్పర్సన్లు కలిపి కూటమి 93 స్థానాలను కైవసం చేసుకోగా, వైసీపీ 4 స్థానాలకే పరిమితమైంది. జెడ్పీటీసీల్లో టీడీపీ 477, జనసేన 75, బిజెపి 23 కలిపి ఎన్డీఏ కూటమి మొత్తం 575 స్థానాలను కైవసం చేసుకోగా వైసీపీ 77 స్థానాలకు పరిమితమైంది. ఇక ఎంపీటీసీల్లో టీడీపీ 6586, జనసేన 1045, బిజెపి 170 కలిపి ఎన్డీఏ కూటమి మొత్తం 7801 స్థానాలు గెలుచుకోగా వైసీపీ 1800 సీట్లతో సంతృప్తి చెందింది. ఈ ఫలితాలు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ఉన్న ప్రజాదరణకు, వైసీపీకి ఎదురైన పరాభవానికి నిదర్శనంగా నిలుస్తుంది.

