దేశానికి అత్యంత ప్రమాదకరంగా కాంగ్రెస్
అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ డఫరీన్ సేఫ్టీ వాల్ సిద్ధాంతంతో బ్రిటిష్ సివిల్ సర్వెంట్ ఏ.ఓ. హ్యూమ్ ఆధ్వర్యంలో ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ మొదటి దశాబ్ద కాలం (1886-95) ప్రతి డిసెంబర్ చివరి వారంలో మూడు రోజులు సమావేశాలు పెట్టుకొని ”మీరే (బ్రిటిష్) పాలకులు, మేం పాలితులం” అని తీర్మానం చేసేవారు. కౌన్సిల్ లో సీట్లు పెంచడం, సివిల్ సర్వీస్ పరీక్షలు భారత్ లో నిర్వహించడం, సివిల్ సర్వీస్ వయో పరిమితి పెంచడం వంటి భిక్షాటన తీరు తీర్మానాలపై ఆగ్రహించిన లోకమాన్య బాల గంగాధర్ తిలక్ సంవత్సరంలో మూడు రోజులు కప్పల్లా అరిస్తే మన కృషికి ఏ ఫలితం ఉండదని అవహేళన చేశారు. కాంగ్రెస్ మీటింగ్ లను మూడు రోజుల తమాషా అని ఒక బెంగాలీ టీచర్ అభివర్ణించారు.
లోకమాన్య తిలక్, లాలా లజపతి రాయ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ అవిరళ కృషి వల్ల కాలక్రమేణ కాంగ్రెస్ స్వాతంత్రోద్యమ పోరాటానికి వేదికగా మారింది. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ బాలగంగాధర్ తిలక్ ను అధ్యక్షుడిగా ఎప్పుడూ కానివ్వలేదు, రెండోసారి జాతీయ అధ్యక్షుడైన సుభాష్ చంద్రబోస్ ను బయటకు పంపించేసింది.
దేశ విభజనకు ముస్లిం లీగ్, బ్రిటిష్ ప్రభుత్వం ఎంత కారణమో, కాంగ్రెస్ అంతకన్నా తక్కువ కారణమేమీ కాదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాటం వల్ల దేశ ప్రజల్లో దేశభక్తి చైతన్యం ఎన్నో రెట్లు పెరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అవిశ్రాంత విశిష్ట శ్రమ వల్ల దేశ పునరేకీకరణ జరిగింది. కానీ సుభాష్ చంద్రబోస్ ను కాంగ్రెస్ లో ఉండనివ్వలేదు. సర్దార్ పటేల్ ను దేశ ప్రధాని కానివ్వలేదు. నెహ్రూ ప్రధాని అయిన కొద్ది కాలంలోనే పాకిస్తాన్ ఫ్రధాని లియాఖత్ అలీఖాన్ తో మైనార్టీ కమిషన్, మైనార్టీ ప్రత్యేక హక్కుల ఒప్పందం చేసుకోవడంతో ఆగ్రహించిన శ్యామ ప్రసాద్ ముఖర్జీ మంత్రి పదవికి రాజీనామా చేశాడు. హిందూ జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు తీసుకొచ్చిన హిందూ కోడ్ బిల్లుకు నిరసనగా డా. బాబాసాహెబ్ అంబేద్కర్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎంత వ్యతిరేకత వచ్చినా నెహ్రూ మైనార్టీ కమిషన్, వక్ఫ్ బోర్డ్, ముస్లిం పర్సనల్ లా బోర్డ్ లాంటి దేశ విచ్ఛిన్నకర మతోన్మాద చట్టాలు ఎన్నో చేశారు. దేశ రక్షణ విషయంలో అప్పటి ప్రధాని నెహ్రూ చేసిన ఘోర తప్పిదాల వల్ల చైనా చేతిలో ఘోర పరాభవం చెందడం, దాదాపు 40వేల చదరపు కిలోమీటర్ల భూభాగం చైనా ఆధీనంలోకి పోవడం, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సీటు వచ్చే అవకాశాన్ని కోల్పోయి, ఇప్పటికీ రాలేని పరిస్థితి వచ్చింది. నిష్కలంక దేశభక్తుడైన లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ లో అనుమానాస్పద మృతిలో కూడా కాంగ్రెస్ హస్తం ఉందన్న భావన భారతీయుల్లో ఇప్పటికీ ఉంది. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కాంగ్రెస్ పార్టీని చీల్చడంతో, మైనార్టీలో పడిన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు దేశద్రోహ ముస్లిం లీగ్, కమ్యూనిస్టుల మద్దతు తీసుకొని, విద్యావ్యవస్థలో కమ్యూనిస్టుల ప్రభావాన్ని పెంచడంతో జేఎన్యూ లాంటి విశిష్ట విశ్వవిద్యాలయాల్లో దశాబ్దాలుగా దేశద్రోహ కార్యకలాపాలు విస్తరించాయి. దేశ తొలి విద్యాశాఖ మంత్రుల్లో మూడు దశాబ్దాలు వరుసగా ముస్లింలను పెట్టడంతో మన విద్యా వ్యవస్థ, ముఖ్యంగా చరిత్ర సంపూర్ణంగా కలుషితమైంది.
తన పదవిని కాపాడుకునేందుకే ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ దేశ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. వందలాది చావులు, వేలాది నిర్బంధాలు, లక్షలాది అమానుష చర్యలు ఈ చీకటి కాలంలో జరిగాయి. కాంగ్రెస్ చేసిన మరో దురాగతం ఇందిరా గాంధీ హత్య అనంతరం చేసిన సిక్కుల ఊచకోత. ప్రతిపక్షాలు ఐక్యమై జనతా పార్టీగా ఏర్పడి లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆధ్వర్యంలో 1979లో ఇందిరా గాంధీని గద్దె దించడంతో మూడు దశాబ్దాల కాంగ్రెస్ నిరాటంక పాలనకు తెరపడింది. ఇందిరా గాంధీ చేసిన కుట్ర వల్లే జనతా పార్టీలో చీలిక వచ్చి, ప్రభుత్వం పడిపోయి, మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ మాత్రమే స్థిర ప్రభుత్వం ఇస్తుందన్న భ్రమ కల్పించి, మళ్లీ అధికారంలోకి వచ్చి, నిరంకుశ పాలన కొనసాగించింది. ఆ తర్వాత, ఇందిరా చావు సానుభూతితో రికార్డు మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్, రాజీవ్ గాంధీ నాయకత్వంలో ఎన్నో అవినీతి పనులు, మతోన్మాద చట్టాలు చేసింది.
3 దశాబ్దాల క్రితమే వాజ్‌పేయి ”కాంగ్రెస్ అధికారంలో ఉంటే దోచుకుంటుంది, నిరంకుశ పాలన సాగిస్తుంది, అధికారం కోల్పోతే అంతకన్నా ప్రమాదకరంగా దేశ విచ్ఛిన్నక చర్యలు పాల్పడుతుంది. ఎంత నీచానికైనా దిగజారుతుంది.” అని అన్నారు. ఇప్పటి కాంగ్రెస్ విదేశీ చేతిలో పుట్టుక లాగే, విదేశాల్లో పుట్టిన వనిత చేతిలో బందీగా, జేబు సంస్థగా నడుస్తోంది.
2014 నుంచి వరుస పరాజయాలను జీర్ణించుకోలేక కాంగ్రెస్ దేశ విద్రోహ చర్యలను మరింత పెంచింది. ప్రభుత్వాన్ని పని చేయనీయకూడదు అన్న దుష్ట, దుర్మార్గ లక్ష్యాలతో నిరంతరం పార్లమెంటులో ఎన్నో అడ్డంకులు కల్పిస్తూ పార్లమెంటు బయట మతోన్మాద, దేశ విచ్ఛిన్నకర శక్తులకు, తుక్డే తుక్డే గ్యాంగ్ లకు నిసిగ్గుగా మద్దతు ఇస్తూ వస్తోంది. రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక విదేశీ శక్తుల చేతిలో కీలుబొమ్మగా మారి.. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ మాదిరిగా జెన్ జెడ్ ఉద్యమం మనదేశంలోనూ జరిగి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కూలదోయాలని పిలుపు ఇచ్చారు. పార్లమెంటులో సభా సంప్రదాయాలు ఏ మాత్రం గౌరవించకుండా కన్ను కొట్టడం, కౌగిలించుకోవడం, కీలక చర్చా సమయాల్లో నిద్ర పోవడం వంటివి చేశారు.
రాహుల్ గాంధీ గత మూడు రోజులుగా స్పీకర్ అనుమతి లేకున్నా డీప్ స్టేట్ ఎజెండాలో దేశ రక్షణకు సంబంధించిన విషయాల్లో తప్పుడు మాటలను ప్రస్తావిస్తూ దేశ ప్రధానిని, రక్షణ మంత్రిని అవనమానించే విధంగా వ్యాఖ్యలు చేస్తూ దశాబ్ద కాలానికి పైగా ఉన్న అక్కసు బయటపెట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వచ్చిన విషయాలతో కాంగ్రెస్ సహా ఇండీ కూటమి మహిళా ఎంపీల ద్వారా కుట్రపూరితంగా ప్రధాని మోదీకి అసభ్యకర ఆరోపణలు అంటించేవిధంగా, దేశ పార్లమెంటు పరువు దిగజార్చే విధంగా, యావత్ ప్రపంచంలో మనదేశ గౌరవానికి తీవ్ర భంగం కలిగించే విధంగా కుట్రలు చేశారంటే, కాంగ్రెస్ రోజురోజుకు ఎంత నీచానికి దిగజారుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ కుట్రలో తెలంగాణకు చెందిన ఒక మహిళా ఎంపీ కీలక పాత్ర పోషించారనీ.. ఈ కుట్రలో బంటీ, బబ్లూ డైరెక్షన్ కూడా ఉందని.. వాళ్ల తప్పటడుగుతో శిండే శివసేన ఎంపీని ఉద్ధవ్ శివసేన ఎంపీగా భావించి ఆమెకు చెప్పడం, ఆమె ద్వారా స్వీకర్ చెవినపడింది. దీంతో స్పీకర్ ప్రధాని మోదీని లోక్ సభకు రావద్దని సూచించడంతో, రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని సమాధానం లేకుండానే ఆమోదించడంతో దేశ గౌరవానికి పెను ప్రమాదమే తప్పింది.
కాంగ్రెస్ అధికారానికే కాదు, ప్రతిపక్షానికి కూడా పనికిరాదు అని దేశ ప్రజలు భావించి, ఒక్క ఎంపీని కూడా ఎన్నుకోవద్దన్న తీరుగా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. ముందుముందు కాంగ్రెస్ ఇంకెన్ని కుట్రలు చేస్తుందో జాగ్రత్తగా ఉండాలి.

