Modi Win

సెల్యూట్‌ తెలంగాణ

మూడోసారి ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ బిజెపి గెలిపించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ‘‘సెల్యూట్ తెలంగాణ’’ పేరిట ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని రాష్ట్ర కార్యవర్గం ఆమోదించింది.

2023 నవంబరులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లకు గాను 8 సీట్లు గెలిపించి కాంగ్రెస్‌కు సరిసమానంగా నిలిపిన తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం సెల్యూట్‌ చేస్తోంది. ఈ ఎన్నికల్లో బిజెపి 8 సీట్లు గెలిచి మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాలలో 46 నియోజకవర్గాల్లో ఆధిక్యం సాధించింది. ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి బిజెపిని ప్రత్యామ్నాయంగా భావించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ప్రజలపక్షాన బిజెపి పోరాటం చేస్తుందని రాష్ట్ర కార్యవర్గం తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తోంది.

స్వతంత్ర భారత చరిత్రలో మూడుసార్లు వరుసగా, నెహ్రూ తర్వాత ప్రధానమంత్రిగా ఎన్నికైన మోదీ గారికి బిజెపి రాష్ట్ర కార్యవర్గం అభినందనలు తెలియజేస్తోంది. కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు ఎన్నికల సందర్భంగా బిజెపి పైన, వ్యక్తిగతంగా మోదీ పైనా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు బిజెపి మిత్రపక్షాలకు (ఎన్డీయే) పట్టం కట్టారు. వచ్చే ఐదు సంవత్సరాల కాలంపాటు బిజెపి ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని వాగ్ధానాలను అమలు చేసి, వచ్చే ఎన్నికల్లో మరింత ఘన విజయం సాధించి, స్వతంత్ర భారత చరిత్రలో కొత్త అధ్యాయం లిఖిస్తుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గం భావిస్తోంది.