బిజెపి భరోసాకు అనూహ్య స్పందన
బిజెపి భరోసాకు అనూహ్య స్పందన వస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఎంపీ లేదా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీని కలిసి బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వ్యక్తులుగాను, గ్రూపులుగాను వచ్చి అనేక సమస్యలను వీరి దృష్టికి తీసుకొస్తున్నారు. తాగునీటి సమస్య, పారిశుద్ధ్య సమస్యలు, పెండింగ్ లో పెట్టిన పేదలకు పంపిణీ చేసేందుకు నిర్మించిన ఇళ్లు, దళిత కుటుంబాల పునరావాస సమస్యలు, పెన్షన్లు, ఉద్యోగాలు, ఫీజు రీఎంబర్స్ మెంట్, నియామకాలు.. ఇలా వేరువేరు సమస్యలను చెప్పుకొంటూ బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. కొన్ని సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ అధికారులు, తదితరులకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడి, సమస్యను పరిష్కరించేందుకు దోహదపడుతున్నారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం కింద బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కోవా లక్ష్మణ్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డి.కె. అరుణ, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్, పైడి రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అసమర్థ పాలనలో కష్టాలనెదుర్కొంటున్న ప్రజలకు భరోసానిచ్చేందుకు బిజెపి – తెలంగాణ ‘బిజెపి భరోసా’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా రోజూ ఒక ప్రజాప్రతినిధి- ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రజల సమస్యలను వింటూ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రోజూ రాష్ట్ర నలుమూలల నుంచి అనేక మంది వచ్చి తమ సమస్యలను చెప్పుకోవడం చూస్తే.. గ్యారెంటీ హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ తీరును ప్రతిబింబిస్తుంది.

