NaMo logo

దేశవ్యాప్తంగా సేవా సంకల్పం

Nitin Nabin Deepamప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం బిజెపి కార్యకర్తలకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మోదీ అభిమానులకు, భారతీయులకు అదొక పండగ రోజు. రోజుకు 24 గంటలు దేశం కోసం, ప్రజల కోసం పని చేస్తూ.. తనను తాను ప్రధానమంత్రి కాదు, ప్రధాన సేవకుడిగా అభివర్ణించుకునే నరేంద్ర మోదీ పుట్టిన రోజును కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కోట్లాది మంది వేడుకగా జరుపుకొంటారు. నరేంద్ర మోదీకి అత్యంత ప్రీతిపాత్రమైన సేవా కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు. బిజెపి కార్యకర్తలు, నాయకులే కాదు.. సామాన్య ప్రజలు కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొని మోదీ పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఈ ఏడాది మోదీ జన్మదినం మరింత ప్రత్యేకమైనది. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాలు నిరంతరాయంగా కొనసాగిన అరుదైన ఘనత ఈ ఏడాది మోదీ సొంతం చేసుకుంటున్నారు. 7 అక్టోబర్ 2001న మోదీ తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అది మొదలు మూడు పర్యాయాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, మూడు పర్యాయాలు భారత ప్రధానమంత్రిగా నిరంతరాయంగా ప్రభుత్వాధినేతగా కొనసాగుతున్నారు. ఈ 7 అక్టోబర్ 2026న ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాధినేతగా నిరంతరాయంగా 25 సంవత్సరాలు కొనసాగిన రికార్డు నెలకొల్పనున్నారు. అందుకే బిజెపి ఈ ఏడాది మోదీ జన్మదినం సందర్భంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ పేరిట నెల రోజుల పాటు అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. మోదీ పుట్టినరోజైన సెప్టెంబర్ 17న ప్రారంభమైన ఈ కార్యక్రమాలు అక్టోబర్ 17 వరకు కొనసాగనున్నాయి.

ఇందులో భాగంగా మోదీ జన్మదినం అయిన సెప్టెంబర్ 17న దేశవ్యాప్తంగా ‘ఆశీస్సుల దీపం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశాన్ని ప్రగతి పథంపై పరుగులు పెట్టిస్తూ, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకొచ్చిన నరేంద్ర మోదీకి కృతజ్ఞతగా సెప్టెంబర్ 17న రాత్రి 7 గంటలకు ప్రతి ఇంటా దీపం వెలిగించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు ప్రతి బిజెపి కార్యకర్త, మోదీ పథకాలతో ప్రయోజనం పొందిన లబ్ధిదారుల కుటుంబాలు, వికసిత్ భారత్ కాంక్షిస్తున్న నరేంద్ర మోదీకి మద్దతు తెలిపే ప్రతి భారతీయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని, ఆశీస్సుల దీపం వెలిగించారు. కొన్ని చోట్ల సామూహికంగా దీపాలు వెలిగించారు.

ఉజ్జయినిలో నితిన్ నబీన్‌‌

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో షిప్రా నది తీరంలోని రామ్‌ఘాట్‌లో బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ‘ఆశీస్సుల దీపం’ వెలిగించారు. రామ్‌ఘాట్, నృసింహ్‌ఘాట్, మహాకాల్ లోక్ తదితర ప్రాంతాల్లో లక్షలాది దీపాలు వెలిగించడంతో అక్కడ సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ ఖండేల్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ నబీన్ మాట్లాడుతూ ”మోదీ జన్మదినాన్ని ‘సేవా దివస్‌’గా జరుపుకుంటున్నాం. 25 ఏళ్ల ప్రజా జీవితంలో దేశ సేవ, ప్రజా సంక్షేమం, సమాజంలో అట్టడుగున వ్యక్తి జీవితంలోనూ సానుకూల మార్పు తీసుకురావాలన్న సంకల్పమే ఈ కార్యక్రమానికి స్ఫూర్తి. ‘ఆశీస్సుల దీపం’ కేవలం దీపం కాదు.. ప్రధాని మోదీపై దేశ ప్రజల ప్రేమ, శుభాకాంక్షలు, ఆశీస్సులకు ప్రతీక. అంత్యోదయ, దేశమే సర్వ ప్రథమం, భారతీయ వారసత్వంతో కూడిన అభివృద్ధి మోదీ పాలనలో కనిపిస్తాయి. సేవ, అంకితభావాన్ని ప్రజల భాగస్వామ్యంతో ముడిపెట్టిన విలక్షణమైన నాయకత్వం ఆయన సొంతం. దేశాన్ని ఏకం చేస్తూ ‘నేషన్ ఫస్ట్’ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తున్నారు.” అని అన్నారు.

తిమ్మాపూర్‌లో వైభవంగా‌‌

NRR Deepamకేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో “ఆశీస్సుల దీపం” వైభవంగా నిర్వహించారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్‌లో జరిగిన రైతుల ముఖాముఖి కార్యక్రమంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రసంగిస్తూ.. ”మోదీ ప్రభుత్వం ఏర్పడకముందు దేశ మహిళలు పేదరికంతో ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం వచ్చాక స్వయం సహాయక సంఘాల ద్వారా లక్షాధికారులుగా మారారు. మోదీ రాకముందు ఎవరికీ బ్యాంకు ఖాతాలు లేవు. గ్యారంటీ లేకుండా లోన్లు కూడా రాకపోయేవి. ఇప్పుడు మోదీ గ్యారంటీతో మహిళలు గొప్పగా జీవిస్తున్నారు. ప్రతి ఒక్క అక్కా చెల్లెళ్లు లక్షాధికారులు అవుతారని మోదీ గ్యారంటీ ఇస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇళ్లు కట్టిస్తున్నాం. రాష్ట్రంలోని ప్రభుత్వం కట్టిస్తున్న ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షలు అందిస్తోంది. రైతుల కోసం ఫసల్ బీమా యోజన ప్రారంభించి, రైతులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నాం.” అని అన్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన ‘ఆశీస్సుల దీపం’లో బిజెపి శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డితో పాటు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు గిరివర్ధన్ రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పా రెడ్డి, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధులు తాడూరి శ్రీనివాస్, పుల్లారావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. బిజెపి రాష్ట్ర నాయకులు, పదాధికారులు, కార్యకర్తలు అందరూ తమ ఇళ్లల్లో, గుళ్లల్లో, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఆశీస్సుల దీపం వెలిగించి, మోదీ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు.

అభియాన్ లో అనేక కార్యక్రమాలు‌‌

నరేంద్ర మోదీ సేవాస్ఫూర్తి, త్యాగం, కృషి, వికసిత్ భారత్ భావన గురించి పిల్లలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా సేవా సంకల్ప్ అభియాన్ కింద ‘నా కలలోని భారత్’ పేరిట స్కూల్స్, కాలేజీల్లో చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు ప్రారంభమయ్యాయి. నరేంద్ర మోదీ సేవలు, త్యాగం, కృషి, విజయాలు, ఘనతలు, వికసిత్ భారత్ నిర్మాణం ఇతివృత్తంగా ఈ పోటీలు జరగుతున్నాయి. ఇలా పిల్లలు గీసిన చిత్రాలతో ఆయా స్కూల్స్, కాలేజీల్లో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారికి సర్టిఫికేట్లు, ఉత్తమ చిత్రాలు గీసిన విద్యార్థులకు, ఉత్తమ ఉపన్యాసానికి గాను విద్యార్థులకు బహుమానాలు అందజేస్తారు. సెప్టెంబర్ 17 ప్రారంభమైన ఈ పోటీలు అక్టోబర్ 7 వరకు జరుగుతాయి. ‘నమో సేవ – చెప్పుకోని కథలు’ కింద వీధి నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. గత 25 ఏళ్ల సేవా కార్యక్రమాల్లో తెలియని కోణాలను ఈ నాటకంలో స్పృశించనున్నారు. ఈ నాటకాలు స్కూల్స్, కాలేజీలతో పాటు గ్రామాల్లోను, పట్టణాల్లోనూ బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించనున్నారు. అంగన్ మిలన్ సేవ కింద అంగన్ వాడీ కేంద్రాల్లో ఉత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 7 వరకు అంగన్వాడీ కేంద్రాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్ల సేవలను గుర్తిస్తూ వారిని సత్కరిస్తారు. అక్టోబర్ 7న నరేంద్ర మోదీ 25 సంవత్సరాలు నిరంతరాయంగా కొనసాగిన ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాధినేతగా రికార్డు నెలకొల్పనున్న నేపథ్యంలో గ్రామాల్లో, పట్టణాల్లో ‘సేవా జ్యోతి కలశ యాత్ర’ చేపట్టనున్నారు. 

సేవా సంకల్ప్ అభియాన్ కింద రక్తదాన శిబిరం, మొక్కలు నాటే కార్యక్రమం, స్వచ్ఛత సేవ, వైద్య శిబిరం, ప్లాస్టిక్ రహితంపై అవగాహన, పేద పిల్లలకు చదువు, కెరీర్ కౌన్సెలింగ్ సెషన్, డిజిటల్ అక్షరాస్యత, అవయవ దానం ప్రతిజ్ఞ డ్రైవ్, మాదకద్రవ్య రహిత భారత్ అవగాహన, పోషకాహారం – రక్తహీనతపై అవగాహన, రహదారి భద్రత అవగాహన, నీటి సంరక్షణ, సైబర్ సెక్యూరిటీపై అవగాహన, ఫిట్ ఇండియా స్పోర్ట్స్ సెషన్, “వోకల్ ఫర్ లోకల్”… ఇలా మొత్తం 25 రకాల సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. సేవా భావం నరనరాన నింపుకొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితోనే 17 సెప్టెంబర్ నుంచి 17 అక్టోబర్ వరకు పార్టీ ఆధ్వర్యంలో, ప్రజలు స్వచ్ఛందంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో బిజెపి కార్యకర్తలు, మోదీ అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొంటున్నారు.

ఉత్సాహంగా ‘సేవా సంకల్ప యాత్ర’

vadnagar to varanasiప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17న ‘సేవా సంకల్ప యాత్ర’ ప్రారంభమైంది. ఈ యాత్ర వడ్నగర్ నుంచి వారణాసి వరకు, వారణాసి నుంచి వడ్నగర్ వరకు రెండు దిశల్లో కొనసాగుతోంది. ఏడు రాష్ట్రాల మీదుగా సాగే ఈ యాత్రలో యువ బైకర్లు పాల్గొని.. మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితం, అభివృద్ధి కార్యక్రమాల సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. యాత్రలో భాగంగా వడ్నగర్ నుంచి సేకరించిన పవిత్ర జలాలతో కాశీ విశ్వనాథుడికి, వారణాసి నుంచి సేకరించిన పవిత్ర జలాలతో వడ్నగర్‌లోని హాట్కేశ్వర్ మహాదేవుడికి అక్టోబర్ 7న అభిషేకం నిర్వహించనున్నారు. మోదీ జీవితం, పోరాటం, సేవాస్ఫూర్తిని యువత, పిల్లలకు చేరవేసి.. భవిష్యత్ తరాలను దేశసేవకు ప్రేరేపించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

గుజరాత్‌లోని మోదీ జన్మస్థలమైన వడ్నగర్ నుంచి వారణాసి వరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ యాత్రను ప్రారంభించారు. వడ్నగర్‌లోని శర్మిష్ఠ తాలాబ్ వద్ద మహా హారతి నిర్వహించిన అమిత్ షా.. హాట్కేశ్వర్ మహాదేవుడి ఆలయంలో అభిషేకం చేశారు. మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్ల ప్రజా సేవను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ యాత్ర చేపట్టినట్లు అమిత్ షా తెలిపారు. మోదీ ప్రధానమంత్రిగా 12 ఏళ్ల పాలనలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేశారని చెప్పారు. 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడేలా చర్యలు తీసుకున్నారని, 80 కోట్లకు పైగా పేదలకు ఇళ్లు, మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీరు, ఉచిత ఆహార ధాన్యాలు, గ్యాస్ కనెక్షన్లు, ఆయుష్మాన్ భారత్ వంటి సదుపాయాలు అందించారని పేర్కొన్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ 24 గంటల విద్యుత్, వ్యవసాయాభివృద్ధి, వైబ్రంట్ గుజరాత్ వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చారని అమిత్ షా తెలిపారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జీఎస్టీ, జనధన్–ఆధార్–మొబైల్ వ్యవస్థ, పీఎం గతిశక్తి, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ”ఇండియా ఫస్ట్” అనే భావనతో మోదీ రాజకీయ, ప్రజా జీవితాన్ని కొనసాగించారని అన్నారు. జాతీయ భద్రత, మౌలిక వసతులు, డిజిటల్ రంగం, ఆరోగ్యం, మహిళా సాధికారత, గిరిజన సంక్షేమం వంటి రంగాల్లో చేపట్టిన చర్యలను ప్రస్తావించారు. వడ్నగర్ నుంచి తీసుకెళ్తున్న పవిత్ర జలాలతో అక్టోబర్ 7న కాశీ విశ్వనాథుడికి అభిషేకం నిర్వహించనున్నారు.

మరోవైపు, వారణాసి నుంచి వడ్నగర్ దిశగా ‘సేవా సంకల్ప యాత్ర’ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. సుమారు 2,000 ఏళ్ల క్రితం సారనాథ్ నుంచి వడ్నగర్‌కు బౌద్ధ సన్యాసులు సాగించిన జ్ఞాన, ఆధ్యాత్మిక యాత్రను ఈ కార్యక్రమం మరో రూపంలో కొనసాగిస్తోందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితంలో దేశసేవకు అంకితమయ్యారని, ఆయన నాయకత్వంలో అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్ఠ గణనీయంగా పెరిగిందని అన్నారు. ముద్రా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, ‘లఖ్‌పతి దీదీ’ వంటి కార్యక్రమాలు యువత, మహిళలకు స్వయం ఉపాధి, స్వావలంబనకు అవకాశాలు కల్పించాయని పేర్కొన్నారు.

2014తో పోలిస్తే భారత్ ఆర్థికంగా, రక్షణ రంగంలో గణనీయమైన మార్పు సాధించిందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. భారత్ ‘ఫ్రాజైల్ ఫైవ్’ నుంచి ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, దేశీయ రక్షణ ఉత్పత్తి, రక్షణ ఎగుమతులు కూడా పెరిగాయని చెప్పారు. యూపీఐ, ఆయుష్మాన్ భారత్, ఎల్‌పీజీ, 5జీ వంటి కార్యక్రమాలు సామాన్యుల జీవితాలను సులభతరం చేశాయని పేర్కొన్నారు. ”నేను తినను.. తిననివ్వను” అనే మోదీ విధానం అవినీతి రహిత పాలనకు, కొత్త పని సంస్కృతికి దిశానిర్దేశం చేసిందని అన్నారు. మోదీ అధికారాన్ని హక్కుగా కాకుండా ప్రజలు అప్పగించిన బాధ్యతగా భావించారని తెలిపారు. కాశీ నుంచి తీసుకెళ్లిన పవిత్ర జలాలతో అక్టోబర్ 7న వడ్నగర్‌లోని హాట్కేశ్వర్ మహాదేవుడికి అభిషేకం నిర్వహించనున్నారు.