Premendar Reddy Pracharam 00

జోరుగా ప్రేమేందర్ రెడ్డి ప్రచారం

Premendar Reddy Pracharamరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి దూసుకుపోతున్నారు. నిత్యం విద్యార్థులు, అడ్వకేట్లు, టీచర్లు, నిరుద్యోగులు… ఇలా వివిధ వర్గాలకు చెందిన పట్టభద్రులను కలిసి ఈ ఎన్నికలో తన గెలుపు ఆవశ్యకతను వివరించారు. గత కేసీఆర్ పాలనలో తెలంగాణకు జరిగిన నష్టాన్ని, ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జరిగిన అన్యాయాన్ని  తెలిపారు. ప్రస్తుత రేవంత్ పాలన కూడా అదేరీతిన కొనసాగుతుందని, 6 గ్యారంటీలు ఎన్నికల స్టంటుగానే మిగిలిపోయిందన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న సంకల్పంతో అహర్నిశలు కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. ఒక్క అవకాశం ఇస్తే శాసనమండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక అవుతానని తెలిపారు.

ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్, శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ సహా బిజెపి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రచారంలో పాల్గొన్నారు. పట్టభద్రులకు చెందిన వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సైతం ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. బిజెపి నేతల ప్రచారానికి పట్టభద్రుల నుంచి సానుకూల స్పందన వ్యక్తమైంది. ప్రేమేందర్ రెడ్డిని గెలిపిస్తామని భరోసా ఇచ్చారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో వచ్చిన ఈ ఉప ఎన్నిక మే 27న జరగనుంది. జూన్ 5న ఫలితాలు వెల్లడవనున్నాయి.