Hamara Sankalp Vikasit Bharat

తెలంగాణలో రజాకార్ లతో కాంగ్రెస్ పొత్తు… ముస్లిం లీగ్ బాటలో మేనిఫెస్టో

ఈ నెల 5న కాంగ్రెస్ ప్రకటించిన 2024 ఎన్నికల మ్యానిఫెస్టో ముస్లిం లీగ్ ఆశయాలు, అభిప్రాయాలను ప్రతిబింబిస్తుంది. దేశంలో మైనార్టీ అనుకూల విధానాలతో మెజారిటీ వాదాన్ని రూపుమాపుతామని, వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో ప్రజల మధ్య వైవిధ్యాన్ని, వేర్పాటువాద భావాలను ప్రోత్సహిస్తామని నర్మగర్భంగా చెప్పింది. వేలాది మంది హిందూ యవతులను బలి చేస్తున్న లవ్ జిహాద్ ను సమర్థిస్తామనీ చెప్పింది. దేశ విభజనకు కారణమైన కాంగ్రెస్ నాటి ప్రధాని నెహ్రూ నుంచి నేటి వరకు మెజారిటీ వ్యతిరేక, మైనారిటీ అనుకూల విధానాలనే అవలంబిస్తూ వస్తోంది. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం నుంచి అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట వరకు హిందూద్వేష, మైనార్టీ అనుకూల, దేశ విచ్ఛిన్నకర విధానాలను పాటిస్తూ వచ్చింది.

రానున్న లోక్ సభ ఎన్నికల్లో కనీసం 40 స్థానాలు కూడా రావని అనేక సర్వేలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అసాధ్యమైన ఆర్థిక హామీలను హిందువులకు ఆశ పెడుతూ, కనీసం 50, 60 స్థానాలు గెలుచుకోవాలన్న ఎజెండాతో ఈ ముస్లిం లీగ్ మ్యానిఫెస్టోను తయారు చేసింది. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆర్థిక హామీలు అమలు కావాలంటే సంవత్సరానికి కోటి కోట్ల రూపాయల నిధులు కావాలి. ఇప్పుడు దేశ బడ్జెట్ 50 లక్షల కోట్ల లోపే. అందులో కనీసం 75 శాతం ప్రణాళికేతర వ్యయమే. అసాధ్యమైన ఆర్థిక హామీలతో కాంగ్రెస్ దేశ ప్రజలను వంచించాలని చూస్తుంది.

తెలంగాణలో గత పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితిలో ఉంది. కనీసం 5 పార్లమెంట్ స్థానాల్లో అయినా గెలుస్తామన్న నమ్మకం లేని కాంగ్రెస్ ఇప్పుడు ఎంఐఎంతో మళ్లీ అంటకాగడానికి నిర్ణయించుకుంది. ‘‘ఎంఐఎంతో కాంగ్రెస్ పొత్తు కుదిరింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ఈ పొత్తు కుదుర్చారు, హైదరాబాద్ పార్లమెంట్ సీటులో ఓవైసీని గెలిపించాలని ఆదేశించారు’’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ బాహాటంగానే చెప్పతారు. తనకు ఇష్టం లేకపోయిన పార్టీ ఆదేశాల మేరకు ఓవైసీ గెలుపు కోసం కృషి చేస్తామని ఫిరోజ్ ఖాన్ చెప్పారు. వరంగల్ లోక్ సభ నియోజకవర్గంలో ఒక ముస్లింను పెళ్లి చేసుకున్న ఎస్సీ యువతికి సీటు ఇవ్వడంతో ఇప్పటికే దళితులు కాంగ్రెస్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

1927 నవంబర్ 12న హైదరాబాద్ సంస్థాన విశ్రాంత ఉద్యోగి నవాబ్ మహ్మద్ నవాజ్ ఖాన్ స్థాపించిన ఎంఐఎం పార్టీ 1938లో బహదూర్ యార్ జంగ్ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో రజాకార్ సంస్థగా రూపాంతరం చెందింది. హైదరాబాద్ సంస్థానంలో కోట్లాది మంది హిందువులను ఊచకోత కోస్తానని సర్దార్ వల్లభాయ్ పటేల్ కు చెప్పిన ఖాసిం రజ్వీ కూడా ఈ సంస్థకు 1944లో అధ్యక్షుడిగా ఎన్నికై హిందువులపై మారణకాండ జరిపారు. వందలాది మానభంగాలు, వేలాది హత్యలు, మరెన్నో ఘోరాలు జరిపిన రజాకార్ల సంస్థను 1948 సెప్టెంబర్ 17  హైదరాబాద్ విమోచన తర్వాత నిషేధించారు. పాకిస్తాన్ కు వెళ్లిన ఖాసిం రజ్వీ 1958లో అసదుద్దీన్ ఓవైసీ తాత అబ్దుల్ వాహిద్ ఓవైసీని తన వారసుడిగా ప్రకటించారు. కాంగ్రెస్ ప్రోద్బలంతోనే ఎంఐఎం తన పేరును ఏఐఎంఐఎంగా మార్చుకొని పునర్జన్మ ఎత్తింతని ఆ పార్టీకి చెందిన ఫిరోజ్ ఖాన్ గతంలోనే ప్రకటించారు.

హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలో ఇప్పుడు వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఎంఐఎం జేబు సంస్థ దారుస్సలాం బోర్డుకు అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి అప్పజెప్పారు. దశాబ్దాల పాటు ఎంఐఎంతో అంటకాగిన కాంగ్రెస్ ఆ పార్టీ తెలంగాణలోనే కాకుండా యావత్ దేశంలో విస్తరించేలా చేసింది. బిజెపిని ఏవిధంగానూ తప్పుబట్టలేక అమ్ముడుబోయిన మీడియా సంస్థలతో ‘‘బిజెపి-బీఆర్ఎస్.. బిజెపి-ఎంఐఎం ఒక్కటే’’ అన్న అబద్ధపు విష ప్రచారాన్ని విపరీతంగా జరిపిన కాంగ్రెస్ ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటుందని తెలంగాణ ప్రజలు నిలదీస్తున్నారు.

దేశంలోనే అసలైన సెక్యులర్ పార్టీ బిజెపినే. ‘‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’’ నినాదాలు, విధానాలతో, అందరి పట్ల సమ భావంతో, అణగారిన వర్గాలపై ప్రత్యేక దృష్టితో, ‘సమస్త దేశ ప్రజల సమగ్ర అభివృద్ధి’ కోసం నిరంతరం కృషి చేస్తున్నది బిజెపి ఒక్కటే. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఓవైసీని ఓడించేందుకు దేశ, ధర్మ భక్తురాలైన డా. కొంపెల్ల మాధవిలతను నిలబెట్టి మతోన్మాద నిర్మూలనకు, తెలంగాణ అభివృద్ధి, దేశ సమగ్రతకు బిజెపి కట్టుబడి ఉందని చెప్పకనే చెప్పింది. ఈ పరిస్థితులను చూస్తున్న తెలంగాణ ప్రజలు మూడోసారి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏకు 400 స్థానాలకు పైగా లభించడం, అందులో తెలంగాణ నుంచి డజనుకు పైగా ఉండడం ఖాయమని భావిస్తున్నారు.