వికసిత భారతానికి 3 ప్రధాన కర్తవ్యాలు
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ, 2047 నాటికి సమగ్రాభివృద్ధితో వికసిత్ భారత్ సాకారం చేయడానికి మార్గాన్ని సుగమం చేసేందుకు నిర్మలా సీతారామన్ 3 కర్తవ్యాలు పేర్కొన్నారు. అవి:
మొదటి కర్తవ్యం
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దేశంలో ఉత్పాదకత, పోటీతత్వాన్ని పెంచి సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధించడం. దీనిలో భాగంగా ఈ ఆరు రంగాల్లో సుస్థిర అభివృద్ధి సాధించడం లక్ష్యం.
- ఏడు వ్యూహాత్మక, నిర్దేశిత రంగాల్లో ఉత్పాదకతను వేగవంతం చేయడం
- పారిశ్రామిక రంగాన్ని పునరుజ్జీవింపజేయడం
- ఎస్ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేక కార్యాచరణ
- మౌలిక సదుపాయాల కల్పనకు బలమైన ఊతం
- దీర్ఘకాలిక ఇంధన భద్రత, స్థిరత్వం
- నగర ప్రాంత ఆర్థిక కార్యకలాపాల అభివృద్ధి
ఇంకా.. హైటెక్ టూల్ రూమ్స్ ఏర్పాటు, పరిశ్రమలకు విద్యాసంస్థల అనుసంధానం, మెగా టెక్స్ టైల్ పార్కుల ఏర్పాటు, 5 సూత్రాలతో ప్రత్యేక కార్యక్రమం. టెక్స్ టైల్ రంగం కోసం వచ్చే ఐదేళ్లకు రూ.10 వేల కోట్లు. జౌళి ఉత్పత్తుల అంతర్జాతీయ బ్రాండింగ్ కోసం ప్రత్యేక కార్యాచరణ. రూ.10వేల కోట్లతో వచ్చే ఐదేళ్లకు బయో ఫార్మా శక్తి పథకం. ఫార్మా విద్య, పరిశోధనకు జాతీయస్థాయిలో మూడు కొత్త విద్యాసంస్థల స్థాపన.
రెండో కర్తవ్యం
- ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు, వారి శక్తి సామర్థ్యాలను పెంపొందించి సుసంపన్న భారత్ దిశగా అడుగులు వేసేలా చేయడం.
- ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో మెడికల్ టూరిజం సర్వీసులు
- ఐదు రీజినల్ మెడికల్ హబ్స్ ఏర్పాటు
- ఆయుష్ కేంద్రాల అప్ గ్రేడేషన్, సంప్రదాయ వైద్య పరిశోధనకు జామ్ నగర్‌లో పరిశోధన కేంద్రం ఏర్పాటు
- ప్రైవేటు రంగంలో పశువైద్య, డయాగ్నస్టిక్స్ ఏర్పాటుకు ప్రోత్సాహం
- యువత కోసం వైద్య రంగంలో కొత్త కోర్సుల ఏర్పాటు
- యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్ రంగాలకు చేయూత
- నేషనల్ డిజిటల్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు
- ఖేలో ఇండియా మిషన్లో భాగంగా క్రీడాభివృద్ధి
మూడో కర్తవ్యం
- ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ విజన్‌తో దేశంలోని ప్రతి కుటుంబం, వర్గం, మతం, రంగా నికి వనరులు, సదుపాయాలు, అవకాశాలను అందిస్తూ అభివృద్ధిలో అర్థవంతమైన భాగస్వా ములుగా చేయడం.
- రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం
- దివ్యాంగుల కోసం దివ్యాంజన్ కౌశల్ యోజన, దివ్యాంగ్ సహకార యోజన
- మానసిక వ్యాధుల చికిత్సకు నేషనల్ ఇన్సి ట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్హన్స్)-2 రాంచీ, తేజ్‌పుర్‌లో నేషనల్ మెంటల్ హెల్త్ ఇనిస్టిట్యూట్ అప్ గ్రెడేషన్
- భారత్ విస్తార్ (వర్చువల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సిస్ అగ్రికల్చర్ రిసోర్స్) వ్యవసాయ రంగానికి కృత్రిమ మేధను అనుసంధానం చేయడం ద్వారా ఉత్పత్తి పెంపు, మదింపు చేసి, రైతులు సస్యరక్షణ చర్యలు తీసుకునేలా ప్రోత్సహించడం
- తూర్పు ప్రాంతంలోని 5 పూర్వోదయ రాష్ట్రాల్లో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, ఇందు కోసం 4వేల ఈ-బస్సులను అందించటం
- అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో బుద్ధిస్ట్ సర్క్యూట్ అభివృద్ధి

