మహిళలకు, దక్షిణాదికి కాంగ్రెస్ తీరని అన్యాయం
మూడు దశాబ్దాలకు పైగా ఇదిగో మహిళా రిజర్వేషన్, అదిగో మహిళా రిజర్వేషన్ అంటూ కాంగ్రెస్ దగా చేస్తూనే వచ్చింది. రాజ్యాంగం ఆదేశించిన ఆర్టికల్ 44 ను గానీ, ఆర్టికల్ 370 చెప్పిన తాత్కాలిక ప్రొవిజన్ ను తొలగించడంపై కాంగ్రెస్ ఎప్పుడూ పిల్లిమొగ్గలు వేస్తూ డ్రామాలు చేస్తూ వచ్చింది. దేశంలో కులమతాలకు అతీతంగా, ప్రజల ఐక్యత కోసం ఉమ్మడి పౌరస్మృతి తేవాలని రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంటే, ఓటుబ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ దానిని విస్మరించింది. ఉమ్మడి పౌరస్మృతి స్థానంలో హిందూ కోడ్ బిల్లు తీసుకొచ్చి.. మరోవైపు ముస్లిం పురుషులు నలుగురిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛనిచ్చి.. హిందూ జనాభాను నియంత్రించి, ముస్లిం జనాభాను పెంచే కుట్రలో కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కింది. మహిళా రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ చేసిన మోసం ఇంతా అంతా కాదు.
ఎమర్జెన్సీలో ఇందిరా గాంధీ ప్రతిపక్షాలను జైళ్లల్లో బంధించి, రాజ్యాంగ పీఠికతో సహా మొత్తం రాజ్యాంగాన్ని, లోక్సభ కాలాన్ని, సర్వోన్నత న్యాయస్థానం అధికారాలను అడ్డగోలుగా మార్చి ఎన్నో అపశృతులకు ఆజ్యం పోసింది. దక్షిణాదిలో తొలి రెండు ఓటముల తర్వాత (కేరళ, తమిళనాడు) కాంగ్రెస్ దేశ సమైక్యతను దెబ్బతీసేవిధంగా ప్రాంతీయవాదాన్ని కూడా రెచ్చగొడుతూ వచ్చింది. ఉత్తర, దక్షిణ భారతదేశ ఆలోచనకు, ప్రాంతీయవాదానికి ఆస్కారం ఇవ్వకూడదని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 5 దశాబ్దాలుగా అటకెక్కిన నియోజకవర్గాల పునర్విభజనను, మహిళా రిజర్వేషన్ లను అమలు చేయడానికి దామాషా పద్దతిలో ప్రతి రాష్ట్రంలో 50 శాతం లోక్సభ, అసెంబ్లీ స్థానాలను పెంచాలని (చిన్నరాష్ట్రాలకు మినహాయింపు) సంకల్పించిన 131వ రాజ్యాంగ సవరణను కాంగ్రెస్ అడ్డుకొని మహిళా రిజర్వేషన్లకు, దక్షిణాది రాష్ట్రాలకు పూడ్చలేని అన్యాయం చేసింది. ఇప్పుడు జరుగుతున్న జనాభా లెక్కల ప్రాతిపదికన రాజ్యాంగం ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది ప్రాతినిధ్యం వాటా గణనీయంగా తగ్గుతుంది. మొదటి మూడు డీలిమిటేషన్ ప్రక్రియలో కూడా కాంగ్రెస్ ఇదే అన్యాయం దక్షిణాదికి చేసింది. మహిళా రిజర్వేషన్ విషయంలో కూడా కాంగ్రెస్ ఎన్నడూ సరైన ప్రయత్నం చేయలేదు. గతంలో వాజ్పేయి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను కుట్రపూరితంగా అడ్డుకుంది. యూపీఏ పదేళ్ల కాలంలో రాజ్యసభలో పాసైన మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టకుండా, నాలుగు సంవత్సరాలు నాన్చి మహిళలకు తీరని అన్యాయం చేసింది. 2023లో మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళా రిజర్వేషన్లు అమలు కాకూడదని కుట్రలు చేస్తూ వచ్చాయి. కేవలం వారి కుటుంబంలోని మహిళలకు మాత్రమే లోక్సభ, అసెంబ్లీల్లో ప్రాతినిధ్యం ఉండాలని, వారికి మాత్రమే మంత్రి పదవులు లభించాలనేది ఇండీ కూటమి తాపత్రయం. ఈ కుట్రలో భాగమే 131వ రాజ్యాంగ సవరణ వీగిపోవడం.
2001 జనాభా లెక్కల ప్రకారం 2002 జూలై 12న డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటైతే, తదనంతరం వచ్చిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కనీసం సిఫార్సులను అమలు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తే, సుప్రీం కోర్టు 2007లో కాంగ్రెస్ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. తదనంతరం కాంగ్రెస్ అమలు చేసిన డీలిమిటేషన్ లో తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య మారనప్పటికీ, నియోజకవర్గాల మార్పులు చేర్పులతో దుర్మార్గ ఓటుబ్యాంకు రాజకీయాలకు తెరతీసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండ లోక్సభ స్థానాన్ని తీసి దాని స్థానంలో మహబూబాబాద్ లోక్సభ స్థానాన్ని తీసుకురావడంలో రామభక్తుడైన హిందూ హనుమ పేరు తీసి, ముస్లిం అయిన మహబూబ్ పేరు తేవాలన్న కుట్ర దాగి ఉంది. అదే హన్మకొండ అసెంబ్లీ పేరును కూడా వరంగల్ పశ్చిమగా మార్చి హనుమంతుడి మీదున్న ద్వేషాన్ని కాంగ్రెస్ బయటపెట్టుకుంది. మొదక్ జిల్లాలో ఉన్న సిద్దిపేట లోక్సభ నియోజకవర్గం స్థానంలో జహీరాబాద్ లోక్సభ స్థానాన్ని తీసుకొచ్చి, సిద్దిపేట పేరులోరి సిద్ధి వినాయకుడు వద్దు అని, జహీరాబాద్ లో ఉన్న జహీర్ మాకిష్టం అని హిందూ వ్యతిరేక, జిహాదీ బానిస వైఖరిని కాంగ్రెస్ ప్రదర్శించింది. అదే మెదక్ జిల్లాలోని రామాయంపేట అసెంబ్లీని కూడా దుబ్బాక నియోజకవర్గంగా తీసుకొచ్చి హిందూ ద్వేషాన్ని వెళ్లగక్కింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రాముడి పేరున్న రామ్మనపేటను తొలగిస్తూ ముస్లింలకు జీ హుజూర్ అనే విధంగా హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని తీసుకొచ్చింది. మొన్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో రేవంత్ రెడ్డి చెప్పినట్టు కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అన్నట్టుగా 2008లోనే రుజువు చేసుకుంది.
పైవిధంగా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, బీఆర్ఎస్ హిందూ, మహిళా, దక్షిణాది వ్యతిరేక కుట్రలు చేస్తూ ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్నట్టు బిజెపి మీదనే తప్పుడు ప్రచారం చేస్తున్న విషయాన్ని ప్రజలు గ్రహించాలి. ఈ 131వ రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా ఓటేసిన కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు భస్మాసురుడిలా వారి నెత్తినే భస్మాసుర హస్తం పెట్టుకున్నారు. ఈ భస్మాసుర ‘హస్తాన్ని’ దేశ ప్రజలు క్షమించరు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లను బొంద పెట్టడం ఖాయం.

