Suculer

జీహాదీల ‘వేట’పై లౌకికవాదులే మౌనం

భారతదేశంలోని స్వయంప్రకటిత ‘సెక్యులరిస్టుల’కు హిందూ-ముస్లిం ‘ఐక్యత’ లేదా ‘గంగా-జమునా తెహజీబ్’ ప్రాముఖ్యం గురించి నిరంతరం నీతులు చెప్పడం ఒక అలవాటుగా మారింది. అయితే, దశాబ్దాలుగా వారు చేస్తున్న ఈ నీతిబోధలు రక్తపాతంతో కూడిన దేశ విభజనను, అటువంటి ఉద్భోధల పట్ల విసుగును తప్ప మరేమీ మిగల్చలేదు. ఊహించినట్లుగానే ఈ వైఫల్యానికి కారణం ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి నిద్రాణమై ఉన్న ఉద్రిక్తతలను పెంచడమని నిందలు వేస్తారు. ఇది డొల్ల విశ్లేషణ మాత్రమే కాదు, ఉద్దేశపూర్వకమైన అబద్ధం కూడా. సమాజానికి సామరస్యాన్ని బోధించే ఇదే మేధావి వర్గం, గత అనుభవాలు లేదా ఎదురయ్యే ప్రమాదాల దృష్టితో అద్దెదారులను ఎంచుకోవడంలో జాగ్రత్త వహించే హిందువును వెంటనే ‘మతమౌఢ్యుడి’గా ముద్ర వేస్తుంది. అయితే, హిందువులను ఒక ప్రద్ధతి ప్రకారం లక్ష్యంగా చేసుకుని, వారిని ఇస్లాంలోకి మార్చడానికి ముస్లిం ముఠాలు చేసే భయంకరమైన నేరాల పట్ల వారు కళ్లు మూసుకుంటారు. ఇది సామాజిక సామరస్యానికి విఘాతం కలిగిస్తున్న ఒక వాస్తవం.

నాసిక్ ఉదంతం: ఒక భయంకర నమూనా 

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఉదంతం ఈ ఆందోళనకరమైన ధోరణికి అద్దంపడుతుంది. విచారణ పెరిగేకొద్దీ మరింత మంది బాధితులు ముందుకు రావడంతో కనీసం తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి, పలువురు నిందితులను అరెస్టు చేశారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తో అనుబంధం ఉన్న ఒక BPO యూనిట్‌లో పనిచేస్తున్న ముస్లిం పురుషులు, మహిళలు హిందువులను, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన మహిళలను ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి చేస్తున్నారు. ‘లేడీ కెప్టెన్’ గా పిలిచే HR అధికారి నిదా ఖాన్ పాత్రపై, పని ప్రదేశంలో ఒత్తిడి, మతమార్పిడి కుట్రల ఆరోపణల నేపథ్యంలో విచారణ జరుగుతోంది. ఇది ఏదో చెదురుమదురు సంఘటన కాదు, భారత ఉపఖండం జనాభా స్వరూపాన్ని మార్చడానికి ఉద్దేశించిన చిరకాల వ్యూహం. మోసం, దోపిడీ, దౌర్జన్యాలతో కూడిన ఒక వ్యూహాన్ని ఈ కేసులు సూచిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా సాగుతున్న అకృత్యాలు

  • లక్నో: డాక్టర్ రమీజుద్దీన్, సలీముద్దీన్, ఖతీజా అనే తండ్రి-కొడుకు-తల్లి త్రయం హిందూ మహిళలను మోసగించి, లైంగిక దోపిడీకి గురిచేసి, బలవంతంగా గర్భస్రావాలు చేయించి, మతమార్పిడికి ఒత్తిడి తెచ్చినందుకు కేసు నమోదైంది.
  • డెహ్రాడూన్: ముబినా యూసుఫ్ అనే ముస్లిం యువతి తన హిందూ క్లాస్‌మేట్‌ను ఇస్లాంలోకి మారి ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
  • బెళగావి: రఫీక్, అతని భార్య కౌసర్ తనపై దారుణమైన లైంగిక దోపిడీకి, దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఒక దళిత మహిళ ఆరోపించారు.
  • మీర్జాపూర్: జిమ్ శిక్షణ సమయంలో మహిళలతో పరిచయం పెంచుకుని, వారిపై లైంగిక దాడులు చేసి, అభ్యంతరకర వీడియోలు తీసి మతమార్పిడికి ఒత్తిడి తెస్తున్నారనే ఫిర్యాదులతో పోలీసులు పలు జిమ్ కేంద్రాలను సీజ్ చేశారు.
  • నోయిడా, సూరత్: నోయిడాలో హరూన్ అనే ట్రైనర్ ఒక వితంతువును వేధించగా, సూరత్‌లో కౌసర్ అలీ అనే వ్యక్తి పెళ్లి పేరుతో ఒక వివాహితను మోసం చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
  • అమరావతి (మహారాష్ట్ర): మొహమ్మద్ అయ్యాజ్ అనే వ్యక్తి 180 మంది మైనర్లను (ఎక్కువగా హిందువులు) లైంగికంగా వేధించి, అసభ్యకర వీడియోలు తీసినందుకు అరెస్టయ్యాడు.

2025లో ఉత్తర ప్రదేశ్ పోలీసులు జలాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా మతమార్పిడి నెట్‌వర్క్‌ను బట్టబయలు చేశారు. దాదాపు 1,000 మంది ఇందులో ఉన్నారని, హిందూ బాలికలను మతం మార్పించేందుకు రూ.500 కోట్ల విదేశీ నిధులు సేకరించారని తేలింది.

అజ్మీర్ దారుణం-చారిత్రక మూలాలు

1992 అజ్మీర్ సీరియల్ రేప్ కేసు ఆధునిక భారతదేశంలో అత్యంత దారుణమైన వ్యవస్థీకృత నేరం. ఫరూక్, నఫీస్ చిస్తీ నేతృత్వంలోని ముఠా పాఠశాల విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని, వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఒక నరకాన్ని సృష్టించింది. 32 ఏళ్ల నిరీక్షణ తర్వాత గానీ 2024 ఆగస్టులో నిందితులకు శిక్ష పడలేదు. ఈ సమస్యలు ఇటీవల కాలంలోనే మొదలయ్యాయని అనుకోవడం తప్పు. వీటి మూలాలు ఇస్లామిక్ దాడులు, బ్రిటిష్ కాలంలో కూడా ఉన్నాయి. గాంధీజీ స్వయంగా 1925 ఫిబ్రవరి 5న రావల్పిండిలో మాట్లాడుతూ, ముస్లింలు మహిళలను కిడ్నాప్ చేసి మతమార్పిడి చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అప్పటి క్షేత్రస్థాయి వాస్తవికతను ప్రతిబింబించింది.

అంతర్జాతీయ ధోరణి

మతమార్పిడి, లైంగిక దోపిడీ కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. బ్రిటన్ లోని ‘గ్రూమింగ్ గ్యాంగ్’ కుంభకోణం మైనర్ బాలికలపై లైంగిక దోపిడీని బయటపెట్టింది, ఇందులో నిందితులందరూ ముస్లింలే. ఇటీవల లండన్‌లో ఒక 14 ఏళ్ల సిక్కు బాలికను కూడా ఇలాగే లక్ష్యంగా చేసుకున్నారు. ఫిలిప్ ఫార్గూస్, క్రిస్టియన్ సి సాహ్నర్ వంటి విశ్లేషకులు ఇస్లామీకరణలో ‘అంతర్వివాహాలు’ ఎలా కీలక పాత్ర పోషించాయో వివరించారు. “ఒకప్పుడు బలవంతం చేసిన చోట, ఇప్పుడు ప్రేమ అదే పాత్రను పోషిస్తోంది” అని వారు పేర్కొన్నారు. భారతదేశంలోని ‘సెక్యులరిస్టులు’ ఈ వాస్తవాలను తక్కువచేసి చూపడం లేదా పూర్తిగా నిరాకరించడం వల్ల మత సామరస్యాన్ని పెంపొందించలేరు. పైగా తమ ధోరణి ద్వారా విద్వేషాలను పెంచుతున్నారు. తమకు ఇబ్బందిగా ఉండే నిజాలను ఎదుర్కోవడానికి నిరాకరించే సమాజం శాశ్వత వైషమ్యాలకు నెలవు అవుతుంది. ‘సెక్యులరిజం’ విశ్వసనీయత కోల్పోకుండా ఉండాలంటే మేధోపరమైన నిజాయితీ అవసరం. ఈ అసహ్యకరమైన వ్యక్తులందరినీ జిహాదీలు అని పిలవవచ్చు, వారు సాధారణంగా తెరవెనుక పని చేస్తారు. అయితే, తమను తాము సెక్యులరిస్టులుగా చెప్పుకునే వారే ఈ దారుణమైన వాస్తవానికి ముఖచిత్రంగా ఉన్నారు. ఈ ఘోరమైన నేరాలను ఈ ‘సెక్యులరిస్ట్ ముఠా’ ఏదో ఒక సైద్ధాంతిక ప్రాతిపదికన సమర్థించినా ఆశ్చర్యం లేదు. దేశ విభజనను సమర్థించినది కూడా ఇదే ముఠాయే కదా.

బల్బీర్ పుంజ్,
బిజెపి మాజీ ఎంపీ