కాంగ్రెస్, బీఆర్ఎస్ జీహాదీ రాజకీయాలు
ప్రస్తుత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ దుర్మార్గ ఓటుబ్యాంకు రాజకీయాలు మరోసారి పెద్దఎత్తున బయటపడ్డాయి. జూబ్లీహిల్స్ లో 25 శాతానికి పైగా ముస్లిం ఓట్లు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓటుబ్యాంకు రాజకీయాలకు తెరతీయడమే కాకుండా.. హిందువులను, దేశాన్ని, సైన్యాన్ని కూడా ఘోరంగా అవమానించే నికృష్ట చర్యలకు పాల్పడ్డాయి.
కాంగ్రెస్ చరిత్రనే దేశ విచ్ఛిన్న, మతోన్మాద, కుమ్ముక్కు రాజకీయాలు. 1947లో దేశ స్వాతంత్ర్యం సమయంలో దేశ విభజనకు బ్రిటిషర్లు, ముస్లిం లీగ్ తో పాటు కాంగ్రెస్ పార్టీదీ ప్రధాన పాత్ర. స్వతంత్ర పోరాటం సమయంలో కాంగ్రెస్ అవలంబించిన మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు, బ్రిటిష్ అనుసరించి విభజించు పాలించు విధానం, ముస్లిం లీగ్ డైరెక్ట్ యాక్షన్ లాంటి కిరాతక చర్యలు దేశ విభజనకు ప్రధాన కారణాలు. దేశాన్ని మతపరంగా విభజించి.. తూర్పు, పశ్చిమ పాకిస్తాన్ ఏర్పాటు సమయంలో లక్షలాది హిందువుల ఊచకోతకు కాంగ్రెస్ కూడా ముఖ్య కారణం. నెహ్రూ, ఇందిర, రాజీవ్, రాహుల్.. నాలుగు తరాలు జీహాదీ, మతోన్మాద రాజకీయాల్లో భాగంగా విదేశీ దురాక్రమణదారుడైన మతోన్మాది బాబర్ సమాధిని ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి దర్శించుకున్నారే కానీ హిందూ ద్వేషంతో అయోధ్య రామమందిరాన్ని దర్శించుకోలేదు.
స్వాతంత్ర్యానంతరం తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తొలినాళ్ల నుంచే ముస్లిం బుజ్జగింపు రాజకీయాలకు తెరతీశారు. నెహ్రూ-లియాఖత్ అలీ ఒప్పందం, మైనార్టీ కమిషన్, మైనార్టీలకు ప్రత్యేక హక్కులు, ముస్లిం పర్సనల్ లా బోర్డ్, వక్ఫ్ బోర్డు ఏర్పాటు, హిందూ కోడ్ బిల్ వంటివి కాంగ్రెస్ చేసిన దుర్మార్గ మత రాజకీయాల్లో ముఖ్యమైనవి.
దేశం వేయి సంవత్సరాల బానిసత్వంలో 700 సంవత్సరాలకు పైగా దురాక్రమణ, మతోన్మాద ముస్లిం రాజుల పాలనలో కోట్లాది హిందువుల ఊచకోత, మానభంగాలు, మతమార్పిడులు.. ఎన్నో జరిగాయి. బ్రిటిషర్లు, కాంగ్రెస్, కమ్యూనిస్టులు అసలైన దేశ చరిత్ర హిందువులకు తెలియకుండా, మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ మహరాజ్ లాంటి దేశ, ధర్మ భక్తులకు సరైన స్థానం ఇవ్వకుండా దిల్లీ సుల్తానులు, మొఘలులే గొప్ప రాజులని చిత్రీకరిస్తూ, దేశ ప్రజల్లో ముఖ్యంగా హిందువుల్లో విష చరిత్రను నింపారు. అసంఘటిత హిందువులను ఆసరాగా చేసుకొని, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఏఐయూడీఎఫ్, మజ్లిస్ లాంటి హిందూ ద్రోహ పార్టీలు దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాకిస్తాన్ కు మద్దతు ఇస్తూ, దేశ సైన్యాన్ని అవమానపరుస్తూ, జిహాదీ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తూ, మతోన్మాద రాజకీయాలకు పరాకాష్ట అనదగ్గవి ఎన్నో చేశాయి. ఇప్పుడు బీఆర్ఎస్, డీఎంకే, ఎస్పీ, ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇతర ఇండీ కూటమి పార్టీలు కూడా ఈ దేశ, హిందూ ద్రోహ పార్టీలతో తీవ్రంగా పోటీ పడుతున్నాయి.
ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా ఎంఐఎం అభ్యర్థినే పోటీలోకి దింపి, ఎన్నికల నియమావళి అమలులో ఉండగా, ముస్లిం ఓటర్లను సంతృప్తి పరిచేందుకు అకస్మాత్తుగా అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చింది. అంతటితో ఆగకుండా పాకిస్తాన్ మన సైనికుల ముడ్డి మీద తన్నిందని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘోరంగా మాట్లాడారు. ‘కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్’ అని బాహాటంగానే హిందూ ద్రోహ, జిహాదీ బానిస రాజకీయాలను కాంగ్రెస్ పరాకాష్టకు తీసుకెళ్లింది. తామేమీ తక్కువ తినలేదు అన్నట్టు బీఆర్ఎస్ కూడా 25 శాతం పైగా ఉన్న ముస్లిం ఓటర్లను దృష్టిలో పెట్టుకొని సల్మాన్ ఖాన్ లాంటి మతోన్మాది, రేపిస్టుతో పాటు మతోన్మాద జీహాదీ గుండాలను పార్టీలో చేర్చుకొని, హిందువుల గుడులను అవమానిస్తూ, ముస్లిం ఖబ్రస్థాన్ లకు గతంలో వందల ఎకరాలు ఇచ్చాం, భవిష్యత్తులో కూడా ఇస్తాం, ముస్లింల అన్ని కోరికలను నెరవేరుస్తామని హామీలు గుప్పిస్తోంది. తెలంగాణ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ కు పోటీగా బీఆర్ఎస్ జీహాదీ బానిస రాజకీయాలను తీసుకెళ్లింది.
సూడో సెక్యులర్ పార్టీ దుర్మార్గ మత రాజకీయాలను ఎండగడుతూ దేశభక్తిని పెంచే, దేశ సమగ్రతను కాపాడే, రామజన్మభూమి లాంటి ఉద్యమాలెన్నింటినో బిజెపి చేసింది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామాలయ నిర్మాణం, సీఏఏ చట్టం, వక్ఫ్ బోర్డు సవరణ చట్టం, పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు సరైన రీతిలో బుద్ధి చెప్పేవిధంగా సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ వైమానిక దాడులు, ఆపరేషన్ సిందూర్ వంటివి చేపట్టింది. పెద్దనోట్ల రద్దు లాంటి ప్రత్యేక చర్యలను చేపట్టి పాకిస్తాన్ ను బిచ్చమెత్తుకునే స్థితికి తీసుకొచ్చింది. మార్చ్ 2026 నాటికి దేశంలో నక్సలైట్లను నిర్మూలించే లక్ష్యంతో ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా వేలాది నక్సలైట్ల లొంగుబాట్లు, వందలాది నక్సలైట్ల ఎన్ కౌంటర్లతో దేశంలో శాంతిభద్రతల పరిస్థితిని అద్భుతంగా సంరక్షిస్తోంది. ఆర్థిక వ్యవస్థను పదో స్థానం నుంచి మూడో స్థానానికి తీసుకెళ్తూ, 200కు పైగా సంక్షేమ పథకాలతో అట్టడుగు వర్గాల ప్రజలతో సహా అందరికీ మేలు జరిగేలా గత 11 ఏళ్లుగా సంక్షేమ అభివృద్ధి సురక్ష పాలన నడిపిస్తుంది.
ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిజెపి ప్రచారం మతోన్మాద బానిస కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు బుద్ధి చెప్పేవిధంగా ప్రజల్లో ముఖ్యంగా హిందువుల్లో చైతన్యం తీసుకొచ్చి, దేశాన్ని ధర్మాన్ని సంరక్షించే విధంగా పెద్దఎత్తున ప్రచారం చేసింది. బీహార్ రెండో దశ పోలింగ్ తో పాటు ఈ 11న జరిగే ఎన్నికలో జూబ్లీహిల్స్ ఓటర్ల తీర్పు జీహాదీ బానిస పార్టీలకు బుద్ధి చెప్పేలా ఉంటుందని బిజెపి భావిస్తోంది.

