modi

140 కోట్ల మంది సమష్టి సంకల్పం, స్వప్నం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అంకితమైన 12 వసంతాలు పూర్తి చేసుకుంది. ‘సంకల్పం నుంచి సిద్ధి’కి సాగిన ఈ సువర్ణ యుగం, భారతదేశ అభివృద్ధి, భద్రత, ఆర్థిక సంస్కరణ, ప్రపంచ ప్రతిష్టలకు సంబంధించి అపూర్వమైన వృద్ధిని సాధించింది. కాంగ్రెస్ ఈ దేశానికి అనిశ్చితిని, అవినీతిని, బలహీన నాయకత్వాన్ని వారసత్వంగా విడిచివెళ్ళగా ప్రధానమంత్రి మోదీ భారతదేశానికి ఆత్మవిశ్వాసం, సుపరిపాలన, అభివృద్ధిలతో కూడిన ఒక సరికొత్త గుర్తింపును ఇచ్చారు. నేడు ప్రపంచం భారత్‌ను కేవలం ఒక ప్రాంతీయ శక్తిగా మాత్రమే కాకుండా, 21వ శతాబ్దపు అత్యంత శక్తిమంతమైన దేశాల్లో ఒకటిగా చూస్తోంది. కాంగ్రెస్ ఇన్నేళ్లుగా రాజకీయాన్ని కేవలం వంశపారంపర్య వారసత్వాన్ని కాపాడుకునే సాధనంగా భావిస్తే, ప్రధాని మోదీ దానిని ‘కుటుంబం కంటే దేశమే మిన్న’, ‘అధికారం కంటే సేవయే మిన్న’ అనే ఒక మహోన్నత లక్ష్యంగా పునర్నిర్వచించారు.

2014లో ప్రధానమంత్రి మొదటగా దేశానికి ‘సమష్టి ఆలోచన’ను అందించారు. ఆ తర్వాత ప్రజల నమ్మకంతో ఆ ఆలోచనను ‘సమష్టి సంకల్పం’గా మార్చారు. నేడు ఆ సంకల్పమే ‘వికసిత్ భారత్’ రూపంలో ఒక సువిశాలమైన ‘సమష్టి స్వప్నం’గా రూపాంతరం చెందింది. ఈ గొప్ప మార్పు మౌలిక సదుపాయాల రంగంలో వచ్చిన అపూర్వమైన విప్లవంతో ప్రారంభమైంది. 2014కు ముందు దేశం కనీస వసతుల కొరతతో కొట్టుమిట్టాడుతుండేది. ఈ మార్పు క్షేత్రస్థాయిలో చూపిన ఫలితం ఏమిటంటే 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మాణమయ్యాయి. నూటికి నూరు శాతం విద్యుద్దీకరణ జరిగింది, ఎక్స్‌ప్రెస్‌వేల నెట్‌వర్క్ ఏడు రెట్లు పెరిగింది. విమానాశ్రయాల సంఖ్య 74 నుండి 165కు చేరింది. ఈ కాలం వలసరాజ్యాల మనస్తత్వం నుంచి మన విముక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. వలసవాద నిర్మూలన ఆరంభాన్ని సూచిస్తుంది. చారిత్రక ప్రదేశాలను లోక్ కళ్యాణ్ మార్గ్, కర్తవ్య పథ్, సేవా తీర్థ్‌గా మార్చడం మన సాంస్కృతిక పునరుజ్జీవనానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

నేటి యువత కేవలం ‘ఉద్యోగాలు వెతికేవారు’గా కాకుండా ‘ఉద్యోగాలు ఇచ్చేవారు’గా మారుతున్నారు. రెండు లక్షలకు పైగా స్టార్టప్‌లు, 125కు పైగా యూనికార్న్‌లతో (వందకోట్ల డాలర్ల మార్కెట్ విలువ చేరుకొన్న స్టార్టప్‌ లు) భారతదేశం ‘మానవ వనరుల’ నుంచి ‘వస్తూత్పత్తి’ వైపు దూసుకుపోతోంది. అదేవిధంగా, దేశంలో ‘మహిళా అభివృద్ధి’ నుంచి ‘మహిళల నేతృత్వంలోని అభివృద్ధి’ వైపు మార్పు కనిపిస్తోంది. ఇక్కడ 3 కోట్లకు పైగా ‘లఖ్ పతి దీదీలు’, భద్రతా దళాలలో మహిళా అధికారుల సంఖ్య నాలుగు రెట్లు పెరగడం నారీ శక్తి సాధికారతను ప్రతిబింబిస్తోంది. పేదల సంక్షేమ రంగంలో, 25 కోట్ల మంది దారిద్ర్య రేఖకు ఎగువకు తీసుకురావడం జరిగింది. నాలుగు కోట్ల పక్కా ఇళ్లు, 44 కోట్లకు పైగా పౌరులకు ఆయుష్మాన్ రక్షణ కవచం, పీఎం ముద్ర యోజన కింద రూ.40 లక్షల కోట్ల విలువైన పూచీకత్తు లేని రుణాలు దీనికి పునాదిగా నిలిచాయి. జన్ ధన్-ఆధార్-మొబైల్ (జామ్) త్రయం, యూపీఐ యుగంలో ఇప్పుడు భారతదేశం వార్షిక డిజిటల్ లావాదేవీలలో రూ.314 లక్షల కోట్ల అద్భుతమైన మైలురాయిని చేరుకొని ప్రపంచ డిజిటల్ చెల్లింపులలో 49 శాతం వాటా కలిగి ఉంది.

ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో సరిహద్దుల అభివృద్ధికి ఇచ్చిన వ్యూహాత్మక ప్రాధాన్యం జాతీయ విధానంలో ఒక తీవ్రమైన మార్పును సూచిస్తుంది. ఒకప్పుడు భారతదేశపు ‘చివరి గ్రామాలు’గా నిర్లక్ష్యానికి గురైన గ్రామాలు ఇప్పుడు ‘మొదటి గ్రామాలు’గా, కేంద్ర బిందువుగా మారాయి. చివరగా, 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత, భవ్యమైన రామాలయ నిర్మాణం, కాశీ విశ్వనాథ్ ధామ్, మహాకాల్ మహా లోక్ పునరుద్ధరణ మన సాంస్కృతిక జాతీయవాదం నాగరికత చైతన్యాన్ని పునరుజ్జీవింపజేస్తున్నాయి. నేడు భారతదేశం అంతర్గతంగా నిరంతరం బలోపేతం కావడమే కాకుండా ప్రపంచ వేదికపై ఒక అగ్రరాజ్యంగా వేగంగా మార్పు చెందింది. మోదీ 32 దేశాల నుండి అత్యున్నత పౌర పురస్కారాలను అందుకోవడం అజరామరమైన భారతీయ చింతనకు, 140 కోట్ల మంది దేశప్రజల కృషికి దక్కిన గౌరవం.

‌‌మోదీ 12 ఏళ్ల పాలనపై ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన నితిన్ నబీన్ 

బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ జూన్ 9న దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక ప్రత్యేక ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ 12 ఏళ్ల పాలన” అనే ఇతివృత్తంతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శులు అరుణ్ సింగ్, దుష్యంత్ గౌతమ్, తరుణ్ చుగ్, దిల్లీ బిజెపి అధ్యక్షుడు, కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా, అలాగే లోక్‌సభ ఎంపీ డాక్టర్ సంజయ్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో సాధించిన విజయాలు, సంక్షేమ పథకాలు, దేశ నిర్మాణంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలను నితిన్ నబిన్ ఈ ప్రత్యేక ప్రదర్శనలో ఆసక్తిగా తిలకించారు.

ఈ ప్రదర్శనలో ముఖ్యంగా:

  • పేదల సంక్షేమం, సామాజిక న్యాయం
  • మహిళా సాధికారత, యువతకు నూతన అవకాశాలు
  • మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ విప్లవం
  • ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) విజన్ మొదలైన అంశాలకు సంబంధించిన కీలక విజయాలను, మైలురాళ్లను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు.

సేవ, సుపరిపాలనలో సరి‌‌కొత్త ప్రమాణాలు

ఈ సందర్భంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో భారతదేశం సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమ రంగాలలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పిందని అన్నారు. “అంత్యోదయ స్ఫూర్తితో, అభివృద్ధి ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తికి సైతం అందేలా ప్రభుత్వం అపూర్వమైన కృషి చేసింది. మహిళలు, యువత, రైతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), ఇతర వెనుకబడిన తరగతులు (ఓబిసి), సమాజంలోని ఇతర వెనుకబడిన వర్గాల సాధికారత కోసం పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం,” అని ఆయన పేర్కొన్నారు. నేడు భారతదేశం ‘వికసిత్ భారత్@2047’ లక్ష్యం వైపు పూర్తి ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతోందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలోని ప్రతి పౌరుడు ఈ పరివర్తనాత్మక ప్రయాణంలో భాగస్వామి అవుతున్నారని ఆయన స్పష్టం చేశారు.

నితిన్ నబీన్,
బిజెపి జాతీయ అధ్యక్షుడు